తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పల్ టెస్ట్‌ మ్యాచ్‌కి ప్రతి రోజు 5 వేల విద్యార్థులకు ఫ్రీ టికెట్‌

HCA President Jagan Mohan Rao on IND vs ENG Match : ఈ నెల 25న ఇండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఉప్పల్‌ జరగతున్న సందర్భంగా రోజుకు 5 వేల విద్యార్థులకు ఉచితంగా అనుమతి ఇస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

HCA Management on IND vs Eng Test Match
HCA President Jagan Mohan Rao on IND vs ENG Match

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 8:30 PM IST

Updated : Jan 20, 2024, 9:31 PM IST

HCA President Jagan Mohan Rao on IND vs ENG Match: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(Hyderabad Cricket Association)అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారిగా మ్యాచ్‌ నిర్వహిస్తున్నామని సంస్థ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు వెల్లడించారు. ఆదివారం ఇండియా, ఇంగ్లాండ్ జట్లు నగరానికి వస్తున్నాయని వెల్లడించారు. తాజ్ డక్కన్​లో ఇంగ్లాండ్, పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఇండియా టీమ్ బస చేస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు 26వేల టికెట్లు విక్రయించామని తెలిపారు. జింఖానా మైదానంలో టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయని అన్నారు.

Hyderabad Cricket Association Funds Golmaal : హెచ్​సీఏలో నిధుల గోల్​మాల్.. ఉప్పల్ పీఎస్​లో ఒకేసారి నాలుగు కేసులు నమోదు

HCA Management on IND vs Eng Test Match: ఈ నెల 23న బీసీసీఐ అవార్డ్స్‌ పార్క్‌ హయత్‌లో జరుగుతాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు తెలిపారు. టెస్ట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దామన్నారు. ఈ నెల 25 భారత్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. జనవరి 26న దేశానికి రక్షణ కల్పిస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్ అధికారులకు ఉచితంగా క్రికెట్ చూపించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈసారి మ్యాచ్‌ చూపిస్తామని వెల్లడించారు. ముందుగా స్కూల్‌ నుంచి నమోదు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

హెచ్‌సీఏ అక్రమాలపై రంగంలోకి దిగిన ఈడీ - మాజీ అధ్యక్షుడు వినోద్‌కు నోటీసులు

Free Ticket for IND vs Eng Test Match : ప్రభుత్వ పాఠశాల పిల్లలకు రోజుకు 5 వేల మందికి చొప్పున(Free Ticket For Students) అనుమతిస్తామని జగన్‌మోహన్‌ రావు పేర్కొన్నారు. వారికి ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. స్టేడియంలోకి పాస్‌లు ఉన్న వారికే అనుమతి ఉంటుందని వివరించారు. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జగన్ మోహన్ రావు తెలిపారు.

"నేను అధ్యక్ష పదవి చేపట్టిన తరవాత మొదటి మ్యాచ్‌. 26 వేల టికెట్స్‌ ఇప్పటి వరకు విక్రయించాం. జింఖానా గ్రౌండ్‌లో టికెట్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆదివారం రెండు జట్లు హైదరాబాద్ చేరుకుంటాయి. 23న బీసీసీఐ అవార్డ్స్ పార్క్ హయత్‌లో జరుగనున్నాయి. దేశ సేవ చేస్తున్న రక్షణ శాఖ సిబ్బందికి ఫ్రీగా క్రికెట్ చూపించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సారి ఉచితంగా మ్యాచ్ చూపిస్తున్నాం. ముందుగా పాఠశాల నుంచి నమోదు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నాం. వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తాం. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నెల 25నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది"- జగన్ మోహన్ రావు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు

ఉప్పల్ టెస్ట్‌ మ్యాచ్‌కి ప్రతి రోజు 5 వేల విద్యార్థులకు ఫ్రీ టికెట్‌

Hyderabad Cricket Association Elections 2023 : ఎట్టకేలకు హెచ్​సీఏ ఎన్నికలు .. తలపడనున్న నాలుగు ప్రధాన ప్యానల్స్

Hyderabad Cricket Association Elections Winner : హైదరాబాద్​ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు

Last Updated : Jan 20, 2024, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details