ETV Bharat / offbeat

వంట పాత్రల నుంచి బ్యాడ్ స్మెల్​ వస్తోందా? - ఈ టిప్స్​ పాటిస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​! - TIPS TO AVOID SMELL FROM UTENSILS

-గిన్నెల నుంచి వచ్చే వాసనతో ఇబ్బందులు -ఈ టిప్స్​ పాటిస్తే స్మెల్​ పరార్​!

How to Get Rid of Smell from Utensils
How to Get Rid of Smell from Utensils (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 10:04 AM IST

How to Get Rid of Smell from Utensils: వంట చేసిన తర్వాత పాత్రల నుంచి వచ్చే వాసన ఓ పట్టాన పోదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. వాసన వస్తూనే ఉంటుంది. ఇక చికెన్​, మటన్​, ఫిష్​ వంటి నాన్​వెజ్​ వంటకాల గురించి చెప్పక్కర్లేదు. ఇవి వండినప్పుడు కేవలం వంట పాత్రల నుంచే కాదు కిచెన్​ నుంచి కూడా నీచు వాసన వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల మసాలాలు వేసి వండినప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఈ సమస్య వంటింట్లో చిరాకు కలిగిస్తూ ఉంటుంది. ఈ వాసన పోగొట్టేందుకు కొద్దిమంది రసాయనాలు కలిగిన క్లీనర్స్​ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల పాత్రలు పాడవడంతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాసనలు పోగొట్టేందుకు సహజమైన చిట్కాలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వైట్ వెనిగర్​: వెనిగర్‌కు శుభ్రం చేసే గుణాలు మెండుగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వెనిగర్​ను ఉపయోగించి వంట పాత్రల నుంచి వచ్చే వాసనను కూడా తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు ముందుగా పాత్రను శుభ్రంగా కడగాలి. అనంతరం ఆ పాత్రలో కొద్దిగా వెనిగర్ చల్లి.. కాసేపు వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే పాత్రల వాసన పోతుందని అంటున్నారు.

నిమ్మకాయ: నిమ్మకాయలోనూ యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి గిన్నెల నుంచి వచ్చే వాసనలను ఇది పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాసన వచ్చే పాత్రను పూర్తిగా నీటితో నింపి దాంట్లో నిమ్మరసం పిండి కొద్దిసేపు వదిలేయాలి. ఆ తర్వాత పాత్రను డిష్‍వాష్‍ లేదా నిమ్మచెక్కతో రుద్దితే వాసన పోతుందని అంటున్నారు.

కాఫీ పొడి: పాత్ర వాసనను పోగొట్టేందుకు కాఫీ పొడి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇందులోని నైట్రోజెన్ ఇందుకు సహకరిస్తుందని వివరిస్తున్నారు. ముందుగా పాత్రలో ఓ టేబుల్‍స్పూన్ కాఫీ పొడి వేయాలి. అనంతరం నీటితో నింపాలి. దాన్ని పొయ్యిపై పెట్టి ఓ రెండు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి.. అలాగే ఓ పావుగంట పక్కనపెట్టాలి. ఆ తర్వాత డిష్‍వాషర్‌తో పాత్రను క్లీన్ చేసుకోవాలి.

వంట సోడా: ఒకవేళ పాత్రల నుంచి మరీ విపరీతంగా వాసన వస్తుంటే వంట సోడా (బేకింగ్ సోడా) ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఓ పెద్ద పాత్రలో నీరు పోసి.. అందులో వాసన వచ్చే పాత్రను ముంచాలి. నీటిలో రెండు చిటికెళ్ల వంట సోడా వేసి కాసేపు నీటిని మరిగించాలి. ఆ తర్వాత పాత్రను నీటి నుంచి బయటికి తీసి శుభ్రం చేస్తే సరి.

శనగపిండి: శనగపిండిని కేవలం వంటల కోసం మాత్రమే కాకుండా.. పాత్రల్లోని వాసనను పోగొట్టేందుకు కూడా ఉపయోగించవచ్చు. దీనికి వాసనను పీల్చుకునే గుణం ఉంటుంది. వాసన వచ్చే పాత్రలో శనగపిండిని కాస్త చిలకరించాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాత్రను గడగాలి. దీంతో ఆ పాత్ర వాసన పోతుంది.

దాల్చిన చెక్క: వంట పాత్రల నుంచి వాసన వస్తుంటే దాల్చిన చెక్కను వినియోగించవచ్చు. స్మెల్​ వచ్చే పాత్రలో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి వేసి, నిండుగా నీరు పోసి స్టవ్‍పై ఓ 5 నిమిషాలు మరిగించాలి. చల్లారాక నీటిని పారబోసి క్లీన్​ చేస్తే వాసన పోతుందని అంటున్నారు.

వెన్న: చేపలు శుభ్రం చేసిన తర్వాత వాటిని ఉంచిన పాత్రల నుంచి వచ్చే నీచు వాసన ఓ పట్టాన పోదు. అప్పుడు వాసన వచ్చే పాత్రలను కొద్దిగా వెన్నతో తోమాలి. ఆ తర్వాత సబ్బు ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పాత్రల నుంచి నీచు వాసన రాకుండా ఉంటుంది. అలానే కొత్త వాటిలా మెరుస్తాయి.

టీ, కాఫీ తయారీకి ఏ పాత్రలు వాడుతున్నారు? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

స్టీల్‌ పాత్రలు, గాజు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌పై - స్టిక్కర్స్​ ఎలా తొలగించాలో మీకు తెలుసా?

ఎంత శుభ్రం చేసినా పాత్రల్లో పసుపు మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.