Harish Rao Tweet On MLA Kaushik Reddy Case :హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా? అని సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా సూటి ప్రశ్న వేశారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనంటే అంటూ మండిపడ్డారు.
బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు :కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. ప్రతీకార చర్యలు అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. "హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్‌రెడ్డి చేసిన తప్పా? ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజాపాలన?" అని హరీశ్‌రావు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Harish Rao Fires On Congress Govt :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఎక్కడ చూసిన అన్నదాతల అత్మహత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గ్రామ పంచాయతీలు ఆగమాగం అవుతున్నాయన్నారు. పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలొ పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.