ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది - విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్‌ - అక్రమ నిర్మాణం నేలమట్టం - GVMC shock for vijaya sai Reddy - GVMC SHOCK FOR VIJAYA SAI REDDY

శకునం చెప్పే బల్లి తానుపోయి కుడితిలో పడ్డట్లు, అందరికీ నీతులు, శుద్దులు చెప్పే విజయసాయిరెడ్డికి GVMC షాక్‌ ఇచ్చింది. ఎదుటివారిపై నోరు పారేసుకోవడం, ట్విట్స్‌తో బూతులు తిట్టడంలో ఆరితేరిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమ బాగోతం మరొకటి వెలుగుచూసింది. విశాఖపట్టణం జిల్లా భీమిలి తీరంలో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆయన కుమార్తె నేహారెడ్డి నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు నేలమట్టం చేశారు.

విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ కట్టడం
విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ కట్టడం (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 10:23 AM IST

Vijayasai reddy occupied place :విశాఖపట్టణం జిల్లా భీమిలి సముద్ర తీరంలో YSRCP నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి CRZ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌)నిబంధనలు తుంగలో తొక్కి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి సముద్రంలో నిర్మించిన అక్రమ ప్రహరీని అధికారులు నేలమట్టం చేశారు. భీమిలి జోన్‌ పట్టణ సహాయ ప్రణాళికాధికారి శ్రీనివాసరావు ఆధ్వరంలో జీవీఎంసీ అధికారులు ఈ కూల్చిలు చేపట్టారు. సిబ్బందితో ఉదయం 7 గంటల నుంచి బీచ్‌ ఒడ్డున హోటల్‌ కోసం వేసిన కాంక్రీట్‌ పిల్లర్స్‌, గోడలు, ఇతర అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూల్చివేతలను అడ్డకుంటారన్న ఉద్దేశంతో ముందస్తుగానే భీమిలి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ సాయంత్రం వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. కూల్చివేతకు అధికారులు మూడు JCBలను వినియోగిస్తున్నారు.

YSRCP అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులు విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున భూదందా నిర్వహించారు. భూములను దౌర్జన్యంగా పెద్ద స్థాయిలో ఆక్రమించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని పౌర సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమాలపై జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌, మరికొందరు ఇతర పార్టీల నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భీమిలి సర్వే నంబర్ 1516,1517,1519,1523 లో ఉన్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలు చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు.CRZలో అక్రమ నిర్మాణాలుపై మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. పిల్‌ నెంబర్‌ 53/2024లో నిర్మాణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందుంచారు.

విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ కట్టడం (ETV Bharat)

విజయసారెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాలతో పాటు ఇతర పిటీషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించింది. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కూల్చివేతల పట్ల విశాఖపట్టణం నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. YSRCP నాయకులు పాల్పడిన మరిన్ని భూఅక్రమాలపై చర్యలు తీసుకోవాలని వారంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

విశాఖలో దసపల్లా భూముల టీడీఆర్ స్కాం

విజయసాయి రెడ్డి అవినీతి అక్రమాస్తులపై సుప్రీం సీజేఐకి పురందేశ్వరి లేఖ

ABOUT THE AUTHOR

...view details