Groundnut Farmers Protest in Mahabubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులు సరైన ధర నిర్ణయించడం లేదంటూ ఆందోళన బాట పట్టారు. నాగర్‌ర్నూల్ జిల్లా అచ్చంపేటలో గిట్టుబాటు ధర కోసం రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్‌కు వచ్చిన వేరుశనగ(Ground Nut)కు ధర నిర్ణయించిన అనంతరం క్వింటాకు కనీసం రూ.7000 ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్లారు. గతంలో ధరలు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ మద్దతు ధర రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులతో మాట్లాడతానని ఛైర్‌పర్సన్ అరుణ రైతులకు నచ్చజెప్పే క్రమంలో కోపోద్రిక్తులైన కర్షకులు కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఛైర్‌పర్సన్‌ను బలవంతంగా వేరుశనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. పలువురు మహిళా రైతులు ఆమెపై దాడి చేశారు.
అనంతరం వ్యాపారులు రావాలంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో(Farmers Protest)కు దిగారు. రైతులను ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు రావటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వేరుశనగకు రీటెండర్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మరోవైపు అచ్చంపేట మార్కెట్‌కు ఆదివారం 32,875 బస్తాల వేరుశనగ వచ్చింది. వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా ఇద్దరు రైతులకు రూ.5000 లోపు ధర పలికింది. అయితే వనపర్తి, కల్వకుర్తి, ఇతర మార్కెట్ల కన్నా అచ్చంపేటలోనే అధిక ధరలు ఉన్నాయని మార్కెట్ కార్యదర్శి వెల్లడించారు. రైతులు రూ.7000 కన్నా ఎక్కువ ధర డిమాండ్ చేస్తున్నారని దీనిపై వ్యాపారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎనుమాముల మార్కెట్ యార్డు ఎదుట మిర్చి రైతుల ధర్నా - వ్యాపారులు దగా చేస్తున్నారంటూ ఆవేదన
"సరకు మార్కెట్‌కు వచ్చేవరకు రూ.6000 నుంచి రూ.7000లు. రైతులకు ఏమో రూ.5500. ఇలా చూస్తే రైతులకు ఏమైనా సంబంధించిన రేటు ఉందా. వేరుశనగ నాటిన దగ్గర నుంచి ఆ పంట చేతికి అందివచ్చే వరకు పెట్టుబడి ఎక్కువ మొత్తంలో అవుతుంది. రైతులే పండించిన పంటకు రేటు చెప్పొద్దా."- రైతులు