తెలంగాణ

telangana

ETV Bharat / state

సాంకేతిక సమస్యలతో ప"రేషన్"- కేవైసీ అప్డేట్‌కు గడువు పెంచిన ప్రభుత్వం - Ration Card KYC Update - RATION CARD KYC UPDATE

Ration Card E-KYC Update : మీరు ఇంకా రేషన్‌కార్డు ఈ-కేవైసీ అప్డేట్‌ చేసుకోలేదా. రేషన్‌కార్డు ఈ- కేవైసీ చేయించకుంటే పథకాల లబ్ధికి ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత నెల సెప్టెంబర్‌లో ముగిసిన గడువును డిసెంబరు 31 వరకు పెంచింది. ఇదే చివరిసారని, మరోసారి ఈ అవకాశం ఉండబోదని సర్కారు స్పష్టం చేసింది.

TG Govt Extend Rationcard E-KYC Update
Ration Card E-KYC Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 3:10 PM IST

TG Govt Extend Rationcard E-KYC Update : రేషన్‌కార్డు ఈ-కేవైసీ అప్డేట్‌ చేయించుకోడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్‌ దుకాణాల్లో ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ -కేవైసీ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకే చౌక ధరల దుకాణంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబంలో లబ్ధిదారుల్లో ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోనట్లయితే వారి పేర్లను కార్డు నుంచి తొలగించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. గతనెల సెప్టెంబర్‌లో ముగిసిన గడువును డిసెంబరు 31వరకు పెంచింది. ఇదే చివరిసారని, మరోసారి ఈ అవకాశం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువులోగా ఈ-కేవైసీ చేయించని నేపథ్యంలో పేర్లు సరిగా లేకపోతే పథకాల లబ్ధికి ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.

లబ్ధిదారులకు అవస్థలు : రాష్ట్రవ్యాప్తంగా పలువురు లబ్ధిదారులు ఆధార్‌ సెంటర్లకు ఎన్నిసార్లు తిరిగినా బయోమెట్రిక్‌ పూర్తికావడం లేదు. వేలిముద్రలు పడకపోవడంతో విసిగిపోతున్నారు. వృద్ధుల విషయంలో ఈ సమస్యలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ- కేవైసీ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికీ పూర్తి కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రేషన్‌కార్డు ఈ-కేవైసీ అప్డేట్‌కు గడువు పొడిగిస్తుందని, ఇతర కారణాలతోనే నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు.

ఈ-కేవైసీ జాప్యానికి కారణాలు :

  • ఆధార్‌ అప్డేట్‌ చేయించుకోకపోవడం, బయోమెట్రిక్‌ ఇబ్బందులు, టెక్నికల్ సమస్యలు ఎదురవ్వడం
  • గత పదేళ్లలో చాలామంది మరణించారు. వారి వివరాలు అప్డేట్ చేయలేదు
  • యువతులు వివాహాలు చేసుకుని వెళ్లిపోవడం
  • వివాహం చేసుకుని కొత్త కాపురాలు ఏర్పాటు చేసుకున్న వారి పేర్లు తొలగించినా, కొత్త కార్డులు మంజూరు కాలేదు

రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్​ కార్డులుండగా, వాటి పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డుదారులకు 6 కిలోల బియ్యం (కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో) ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా, అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కిలోల బియ్యం అందజేస్తున్నాయి.

నేటినుంచి మీ ఇంటికి ఆఫీసర్లు - ఫ్యామిలీ డిజిటల్​ కార్డుల కోసం - అవి ఎందుకో తెలుసా? - telangana family digital cards

యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు- హెల్త్ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టుపై మంత్రి పొంగులేటి కీలక విషయాల వెల్లడి - Digital Health Profile Card Project

ABOUT THE AUTHOR

...view details