ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం కీలక నిర్ణయం - పలు వర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం - Govt Appointed University VCs

Government Has Appointed In-Charge VCs: రాష్ట్రంలోని పలు వర్సిటీలకు ఇన్​ఛార్జ్​ వీసీలను ప్రభుత్వం నియమించింది. వైఎస్సార్సీపీ హయాంలో వర్సిటీల్లో స్వామి భక్తి చాటుకున్న ఉపకులపతులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండటంతో వారు రాజీనామా చేశారు. ఇప్పుడు వారి స్థానాలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్త వారిని నియమించింది.

Universities VCs Appointed
Universities VCs Appointed (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 7:40 PM IST

Government Has Appointed In-Charge VCs For Universities: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను ప్రభుత్వం నియమించింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా చిప్పాడ అప్పారావు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా బి. అనిత నియమితులయ్యారు. అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా గొట్టపు శశిభూషణ్‌రావు, నాగార్జున యూనివర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్‌, జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌ఛార్జ్ వీసీగా సుదర్శన్‌రావు, తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వి.ఉమ, జేఎన్‌టీయూ విజయనగరం ఇన్‌ఛార్జ్ వీసీగా రాజ్యలక్ష్మి, జేఎన్‌టీయూ కాకినాడ ఇన్‌ఛార్జ్ వీసీగా మురళీకృష్ణ, నన్నయ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వై. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా - AU VC and Registrar Resigned

నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీగా సారంగం విజయ భాస్కర్‌రావు, కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీగా ఆర్‌. శ్రీనివాస్‌రావు, రాయలసీమ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీగా ఎన్‌టీకే నాయక్‌, ద్రవిడ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఎం. దొరస్వామి, ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్‌, ఒంగోలు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీగా డీవీఆర్ మూర్తి, అబ్దుల్ హక్‌, ఉర్దూ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా పఠాన్‌ షేక్‌ ఖాన్‌, యోగి వేమన వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా కె. కృష్ణారెడ్డిలను ప్రభుత్వం నియమించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. డీఎంఈ నరసింహంకు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్వామి భక్తి చాటుకొని రాజీనామా చేసిన కొందరు వీసీల స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్త వారిని నియమించింది.

వైఎస్సార్సీపీ విధేయ వీసీ రాజీనామా- ఉద్యోగులు, విద్యార్థుల సంబరాలు - ANU VC Rajasekhar Resigned

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో స్వామి భక్తి చాటుకున్న ఉపకులపతులు, రిజిస్ట్రార్​లు వంటి కీలక పదవుల్లో నియమితులైన కొందరు ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండటంతో వారు రాజీనామా చేశారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ నేతల అండతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. దాంతో కొందరు ఉపకులపతులు రాజీనామా చేయడంతో పూర్వపు విద్యార్థులు సైతం సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించిన నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ రాజీనామాతో ఉద్యోగులు, విద్యార్థి సంఘాల సంబరాలు చేసుకున్నారు.

పలు వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా - సంబరాల్లో విద్యార్థులు - University Registrars Resigns in AP

ABOUT THE AUTHOR

...view details