Gold Loans In Google Pay : డబ్బుల కోసం జనాలు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. అత్యవసరమైన వాళ్లంతా అప్పుల బాట పడతారు. అలాంటి మార్గాల్లో గోల్డ్ లోన్ ఒకటి. అయితే, బంగారం తాకట్టుతో రుణాలు పొందడం ఓ ప్రహసనం. అందులో రకరకాల కండీషన్లు ఒక ఎత్తయితే.. అధిక వడ్డీభారం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో.. తక్కువ వడ్డీకే గోల్డ్ రుణాలు అంటూ గూగుల్ ప్రకటించింది.
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్థిక సేవల సంస్థ గూగుల్‌పే (జీపే) ద్వారా బంగారం తనఖా రుణాలు అందజేసేందుకు గోల్డ్ లోన్‌లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అయిన ముత్తూట్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోని మొత్తం పసిడిలో 11% ఇండియాలోనే ఉందని గూగుల్ ఇండియా ఎండీ రోమా దత్తా చోబే పేర్కొన్నారు.
పసిడి రుణాలను జీపే ద్వారా : భారతీయులు బంగారంతో సుదీర్ఘ సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉన్నారని, అది పెట్టుబడికి మించినది ఆయన తెలిపారు. ఈ ఆస్తిని ఆర్థిక కార్యకలాపాల కోసం సమీకరించవచ్చని, అందులో భాగంగానే రుణాల కోసం ఆలోచన చేయవచ్చన్నారు. ఈ మేరకు భారతీయులకు అందుబాటు వడ్డీ రేట్లతో, పసిడి రుణాలను జీపే ద్వారా పొందొచ్చని.. ‘గూగుల్ ఫర్ ఇండియా’ 10వ ఎడిషన్ ఈవెంట్లో తెలిపారు.
భారతదేశమంతటా ఇప్పుడు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు ఈ గోల్డ్ లోన్ ఆఫర్‌ను సరసమైన వడ్డీ రేట్లకే, సౌకర్యవంతమైన వినియోగ ఎంపికలతో యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల రుణగ్రహీతకు (Borrower), రుణదాతకు భద్రతను పొందవచ్చు. ఇదే విషయాన్ని ఈ ఏడాది గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో టెక్నాలజీ కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
యూజర్లకు మరింత చేరువగా జీపే :ఈ సేవలతో Google Pay దాని సురక్షిత రుణాలను అందించడానికి, డిజిటల్ చెల్లింపుల యాప్‌లో మరిన్ని క్రెడిట్ ఆఫర్‌లను పొందేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లతో వినియోగదారులకు ఫ్రెండ్లీగా మారిన జీపే. ఇప్పుడు ఈ గోల్డ్ లోన్ సేవలతో మరింత చేరువ కానుంది. ఇటీవల 'యూపీఐ సర్కిల్' ఫీచర్‌ను లాంఛ్ చేసింది. దీని ద్వారా ఒక యూజర్ తన కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కు, తన సొంత యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయాన్ని కల్పించింది. అవతలి వ్యక్తులకు బ్యాంకు అకౌంట్ లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబయి వేదికగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్, 2024లో భాగంగా యూపీఐ సర్కిల్‌తో పాటు మరికొన్ని ఫీచర్లతో జీపే రోజురోజుకు మరింత చేరువవుతుంది.
బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - How Does A Gold Loan Work
Gold Loan Vs Personal Loan : గోల్డ్ లోన్ Vs పర్సనల్ లోన్.. ఏది బెస్ట్ ఆప్షన్!