తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన జీవో నంబర్​ 317 బాధితులు - సమస్య పరిష్కారంపై హమీ - Employees Meet CM Revanth Reddy in Hyd - EMPLOYEES MEET CM REVANTH REDDY IN HYD

GO 317 Affected Employees Meet CM Revanth Reddy : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీవో నంబర్ 317 బాధిత ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్​ రెడ్డిని తన నివాసం దగ్గర కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్​ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని వాపోయారు.

SPOUSE TEACHERS AGAINST ON GO 317
GO 317 Affected Employees Meet CM (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 2:50 PM IST

GO 317 Affected Employees Meet CM Revanth Reddy : రాష్ట్రంలో జీవో నంబర్​ 317 బాధిత ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్​ రెడ్డి నివాసానికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మందికి ఉద్యోగ ఉన్నతులను నిలిపివేశారని, ఎందుకోసం ఆపారనేది ఇప్పటివరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి సమస్యను విన్నవించినట్లుగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

GO 317 in Telangana : రాష్ట్రవ్యాప్తంగా 317 జీవో బాధితులు హైదరాబాద్​లో ఆందోళనలు చేపట్టారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఉద్యోగుల బదిలీ కోసం త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. వారు తమ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్​ రెడ్డి నివాసానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు. ఓ ఉద్యోగి మెడికల్​ డిపార్ట్​మెంట్​లో ఏఎన్​ఎం నర్సుగా విధులు నిర్వహిస్తున్నా 22 సంవత్సరాల క్రితమే రాత పరీక్ష ద్వారా ఎంపికైనప్పటికి తమకి అందాల్సిన బెనిఫిట్స్ దక్కలేదని వాపోయారు.

సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన జీవో నంబర్​ 317 బాధితులు సమస్య పరిష్కారంపై హమీ (ETV Bharat)

"నేను భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో నివసిస్తున్నాను. నాకు బాసర జోన్​లో ఉద్యోగం కల్పించారు. మా కుటుంబసభ్యులను కలుసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ జోవో నుంచి మమ్మల్ని విముక్తులను చేయాలని కోరుతున్నాను. కాంగ్రెస్​ మేనిఫెస్టోలో దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. అందుకే ఇప్పుడు మేం ముఖ్యమంత్రి వద్దకు వచ్చాం. ఉద్యోగం చేయాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఆరోగ్య రీత్యా మేము ఇబ్బందులు పడుతున్నాం."- బాధిత ఉద్యోగి

GO 317 Affected Employees Protest in Hyderabad : 317 జీవోతో స్థానికత కోల్పోయి కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నామని బాధిత ఉద్యోగులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు వీరికి మద్దతు ప్రకటించాయి. పీఆర్​టీయూ తెలంగాణ నాయకుడు హర్షవర్ధన్ గురువారం ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరించామని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇటీవల నియమించిన త్రిసభ్య కమిటీ కూడా నివేదిక అందించిన తర్వాతనే బదిలీల షెడ్యూలు విడుదల అయ్యేలా చూస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. అనంతరం వారందరూ కలిసి సీఎంకు వినతి పత్రం అందించారు.

Teachers Fight For Spouse Transfers : స్పౌస్ ఉపాధ్యాయల ఆందోళన ఉద్రిక్తం.. పోలీసుల తీరుతో విలపించిన చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details