తెలంగాణ

telangana

ETV Bharat / state

వీధి కుక్కలతో సమస్యా - ఈ టోల్​ ఫ్రీ నంబర్​కు కాల్​ చేసి కంప్లైంట్​ చేయండి - GHMC Dog Catching Helpline Number - GHMC DOG CATCHING HELPLINE NUMBER

Street Dogs Menace in Hyderabad : నగరంలో ఇటీవల జరిగిన కుక్క కాటు సంఘటనలతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. పౌరులెవరైనా 24 గంటల పాటు ఎప్పుడైనా ఈ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్​ఎంసీ ట్వీట్ చేసింది. వీటితో పాటు మై జీహెచ్​ఎంసీ (MYGHMC) యాప్ ద్వారా కూడా కుక్కల బెడద ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.

GHMC Dog Catching Helpline Number
Street Dogs Menace in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 12:16 PM IST

GHMC Dog Catching Helpline Number : వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో నగర పాలక సంస్థ కాల్‌ సెంటర్‌ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్‌ సెంటర్‌ పని చేస్తుందని, వీధి కుక్కల సమస్య గురించి పౌరులు 040-21111111, 040-23225397 ఫోన్‌ నంబర్లను సంప్రదించి సాయం పొందవచ్చని జీహెచ్​ఎంసీ ట్వీట్ చేసింది.

ఫిర్యాదు అందిన వెంటనే డాగ్ క్యాచింగ్ సిబ్బంది వచ్చి నేరుగా వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. వాటికి అక్కడ సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సతో పాటు ఒకవేళ రేబిస్ సోకి ఉంటే టీకాలు వేస్తారు. దశల వారీగా జీహెచ్​ఎంసీ పరిధిలోని వీధి కుక్కలన్నింటికీ 100 శాతం యాంటీ రేబీస్ టీకాలు వేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు మై జీహెచ్​ఎంసీ (myghmc) యాప్ ద్వారా కూడా కుక్కల బెడద ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ : కుక్కకాటు వల్ల ఇటీవల జవహర్‌నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడం, చాలా రోజులుగా ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సర్కారు ఎన్జీవో ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేసి స్పెషల్​ యాక్టివిటీ రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా బల్దియా పలు చర్యలు తీసుకుంటోంది. కాల్‌ సెంటర్‌కు సమస్యను తెలియజేయగానే, దగ్గర్లోని వెహికల్స్​ అక్కడికి చేరుకుని, కుక్కలను తీసుకెళ్తాయని అధికారులు తెలిపారు. వాటిని మూడు రోజులపాటు సంరక్షణ కేంద్రంలో ఉంచి, అవసరమైన శస్త్రచికిత్సలు (కుని), టీకాలు వేసి సంరక్షిస్తామన్నారు.

కుక్కల కట్టడికి - 11 లక్ష్యాలు : మరోవైపు వీధి కుక్కల సమస్య నివారణకు నగర పాలక సంస్థ 11 లక్ష్యాలను నిర్దేశించుకుని, అమలుకు శ్రీకారం చుట్టింది.

  • కుక్కల ప్రవర్తన, ఎలా తప్పించుకోవాలి, జాగ్రత్తలపై కాలనీ సంఘాలు, టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్లు, ఎస్‌హెచ్‌జీలతో అవగాహన కల్పించడం.
  • నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద శిశువుల కేర్ సెంటర్ తప్పనిసరి.
  • పెంపుడు యానిమల్ వివరాల నమోదుతో కుక్కకాటు ఘటనల నియంత్రణ.
  • నీటి తొట్టెలు, ఆహారం అందించే ప్రాంతాలు, జంతు సంరక్షణ కేంద్రాలు, ఎన్జీవోలు, మాంసం వ్యర్థాలను పడేసే ప్రాంతాలు, దుకాణాలు, నమోదు కేంద్రాలను జియోట్యాగ్‌ చేసి డిజిటల్‌ మ్యాపింగ్
  • దత్తత ప్రోగ్రామ్స్
  • 24 గంటలూ కుక్కలను పట్టుకునే వెహికల్స్​ సేవలు
  • కుని శస్త్రచికిత్సలు, రేబిస్‌ టీకాలు వేయడం
  • మూసీ నదీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

కుక్కల దాడుల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - హెల్ప్ లైన్ నెంబర్​ ఏర్పాటు చేయాలని సూచన - TG High Court Serious On Dogs Issue

డేంజర్ డాగ్స్ - పిక్కలు పీకుతున్న కుక్కలు - మొద్దు నిద్రలో అధికారులు - Stray Dog Attack Cases In Nalgonda

ABOUT THE AUTHOR

...view details