Ganja Gang Arrest In Hyderabad :కొరియర్ సర్వీస్ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్లు తెప్పించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న పాన్‌డబ్బా యజమానిని టీఎస్ న్యాబ్ పోలీసులు నానక్‌రాంగూడలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 2.8 కిలోల బరువున్న 560 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అసోంకి చెందిన హిలాలుద్దీన్ మజుందార్ మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి నానక్‌రాంగూడలో పాన్ దుకాణాల్లో పనిచేశాడు. రెండేళ్ల క్రితం సొంతంగా కావూరీ కపిల్ హబ్ దగ్గర హిలాలుద్దీన్ పేరిట దుకాణం ఏర్పాటు చేశాడు.
Ganja Chocolates In Hyderabad :మజుందార్‌యూపీలోని లఖ్‌నవూకు చెందిన బిపిన్ అనే వ్యక్తి ద్వారా గంజాయి చాక్లెట్లు తెప్పించేవాడు. బాగా పరిచయం ఉన్నవారికి మాత్రమే విక్రయించేవాడు. గత కొన్ని రోజులుగా ఆ దందాపై నిఘా ఉంచిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ కోకాపేట వద్ద గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని ఒడిశాకు చెందిన సౌమ్యారాజన్‌గా గుర్తించారు. అతడి నుంచి 4 కిలోల బరువున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓఅపార్ట్‌మెంట్‌లో కార్మికులకు విక్రయిస్తుండగా సౌమ్యారాజన్‌ని వలపన్ని పట్టుకున్నారు.
శంకర్‌పల్లిలో 44 కేజీల గంజాయి స్వాధీనం - నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ganja Chocolates In Khammam :హైదరాబాద్ తరహాలో ఖమ్మంలోనూ గంజాయి చాక్లెట్లు గుట్టురట్టయ్యాయి.కాల్వొడ్డు ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న ఇద్దరిని ఆబ్కారీశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లు సహా మరి కొంత సరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ ప్రాంతం నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.