వామ్మో - గన్స్ అమ్ముతున్న ముఠా - తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం - GANG SELLING GUNS ARRESTED
రాచకొండ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ - వారి దగ్గర నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసకున్న పోలీసులు
Published : Jan 15, 2025, 10:01 AM IST
Gang selling guns arrested In Hyderabad: హైదరాబాద్లోని రాచకొండ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని బిహార్, రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని కొందరు వ్యక్తులకు తుపాకులు విక్రయించేందుకు వచ్చినట్లు అనుమానం. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఠాలోని కీలక సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.