తెలంగాణ

telangana

ETV Bharat / state

పవన్ కల్యాణ్​, బాలయ్యకు 'దండుమల్కాపురం'తో ఏంటి సంబంధం? - NBK 109 SHOOTINGIN NALGONDA

సినిమా షూటింగ్​లకు కేరాఫ్​ అడ్రస్​గా దండుమల్కాపురం గ్రామ ప్రాంతం- అగ్ర కథానాయకుల క్లైమాక్స్ సీన్స్ షూట్ చేసేందుకు మొగ్గు చూపుతున్న దర్శకులు- గబ్బర్​ సింగ్​ చిత్రంతో స్టార్ట్​ చేసిన హరీశ్​ శంకర్​

Balakrishna movie shooting
GABBAR SINGH MOVIE CLIMAX SCENE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2024, 1:30 PM IST

Updated : Oct 23, 2024, 3:08 PM IST

Movie Shootings At Dandumalkapur : చుట్టూ ఎత్తైన కొండలు ఆహ్లాదకరమైన గాలి. ఎటు చూసినా ఎర్రటి నేల ప్రాంతం దండుమల్కాపురం. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో సినిమాల చిత్రీకరణలకు కేరాఫ్‌గా మారింది ఈ ప్రాంతం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ఈ గ్రామ శివారు ప్రాంతాల్లో పలువురు పెద్ద హీరోల సినిమాల షూటింగ్ జరిగింది. ఎక్కువగా ఇక్కడ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లోని క్లైమాక్స్‌ ఫైటింగ్‌ సన్నివేశాలనే చిత్రీకరించారు. ప్రస్తుతం హీరో బాలయ్య నటిస్తున్న(NBK 109) సినిమా చిత్రీకరణ కూడా ఇదే గ్రామంలో జరుగుతోంది.

నెల రోజుల క్రితం ఇక్కడ వేసిన రాజస్థాన్‌ పల్లెటూరు సెట్ అక్కడి ప్రజలను, అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే హీరో బాలకృష్ణ, హీరోయిన్​పై ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) తెరకెక్కించారు. మరికొన్ని రోజుల పాటు ఇక్కడ సినిమా చిత్రీకరణ జరుగనున్నట్టు మేకర్స్ తెలిపారు.

అగ్ర హీరోల షూటింగ్స్ జరిగిన ప్రాంతం (ETV Bharat)

బాలయ్య​ టు మహేశ్​, పవన్​.. టాలీవుడ్ స్టార్ హీరోస్​ అంతా శ్రీలీలతోనే..

గబ్బర్‌ సింగ్‌తో హరీశ్​ శంకర్​ :దండుమల్కాపురంలో తొలుత పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా క్లైమాక్స్‌ ఫైటింగ్‌ను దశల వారీగా ఇక్కడే చిత్రీకరించారు. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ స్కార్పియో వాహనాలతో తీసిన ఛేజింగ్‌ ఫైటింగ్‌ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇదే సినిమాలో ఓ పాటలో కూడా ఈ ప్రాంతం ఉంది. దర్శకుడు రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో హీరో ప్రభాస్‌ నటించిన ‘రెబల్‌’ సినిమా షూటింగ్​ కూడా ఇక్కడే జరిగింది.

హెలీకాప్టర్‌లో ప్రభాస్‌ రావడం, హీరో, విలన్‌ మధ్య ఫైటింగ్‌ చేసే సీన్స్ ఇక్కడే తీశారు. డైరెక్టర్​ శ్రీనువైట్ల దర్శకత్వంలో హీరో మహేశ్‌బాబు నటించిన ‘ఆగడు’ సినిమా, సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ఈ చిత్రంలో విలన్‌ జగపతిబాబు వ్యాపారంలో భాగంగా నిర్మించే గ్యాస్‌ ప్లాంట్‌ సెట్టింగ్‌ వేసి హీరో, విలన్, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌పై పలు సీన్స్ తీశారు. సినిమాలో వచ్చే ఫైటింగ్‌లు, పాటల్లో కూడా పలు సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమా షూటింగ్‌లు జరిగిన ప్రాంతాలు ఇప్పుడు పారిశ్రామిక పార్కులో కలిసిపోయాయి. ఈ పార్కు ఎదురుగానే నందమూరి బాలకృష్ణ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో హీరోలు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, హీరోయిన్‌ అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ , సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలను దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలోని మైలారం రోడ్డులోని కొండలు గుట్టల్లోనే చిత్రీకరించారు. ఈ సినిమాల కోసం భారీ బడ్జెట్​తో సెట్టింగ్‌లను వేశారు.

'NBK109' క్రేజీ అప్డేట్- బాలయ్య కోసం 2 పవర్​ఫుల్ టైటిల్స్!

'రోలెక్స్'​కు ఆ సినిమాతో కనెక్షన్స్​ - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య

Last Updated : Oct 23, 2024, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details