Futuristic Lab on Wheels : భవిష్యత్ తరాలు వినియోగించే టెక్నాలజీనంతా ఒడిసిపట్టి, యువతరానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తే ఎలా ఉంటుంది? ఆ వినూత్న ఆలోచన నుంచి రూపొందిందే ఈ ఫ్లో బస్సు. FLOW అంటే, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అని అర్థం. భవిష్యత్‌లో నేర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉంటుందో ముందే విద్యార్థులకు చూపించాలనే ఉద్దేశంతో మూడేళ్లు శ్రమించి ఈ ఫ్లో బస్సును తయారు చేశారు.
YUVA: పరిశోధనల్లో యువ వైద్యురాలి ప్రతిభ - 10 పేటెంట్ హక్కులు పొందిన డాక్టర్ - Young Doctor Uma Devi
ఈ యువకుడి పేరు మధులాశ్ బాబు. ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి జిల్లా స్వస్థలం. తండ్రి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలపై మధులాశ్‌కు మక్కువ ఎక్కువ. బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ తీసుకుని., వినూత్నంగా రాణించాలనుకున్నాడు. కానీ, తను ఆశించిన స్థాయిలో విద్యాబోధన సాగడం లేదని మధనపడ్డాడు. తనలాంటి సమస్య మరెవ్వారికీ రాకూడదని వినూత్న ఆలోచనకు శ్రీకారం చూట్టాడు.
కొత్తగా వస్తున్న టెక్నాలజీని విద్యార్థులు నేర్చుకోవాలంటే పాఠశాల, కళాశాల స్థాయిలో సరైన ల్యాబ్‌లు, మెంటర్స్ అందుబాటులో ఉండాలి. కానీ, మన వ్యవస్థలో ఆ విధానం లేకపోవడం, పైగా అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి విద్యార్థులూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి అంశాలన్ని మధులాశ్ బాబును మరింత ఆలోచనలో పడేశాయి. అలా ఇతని మేధోమథనం నుంచి ఈ ఫ్లోబస్ ఆలోచన పుట్టింది.
మధులాశ్ బాబు ఆలోచన కార్యరూపం దాల్చడానికి మూడేళ్లు పట్టింది. ఆర్థిక అవరోధాలు ఎదురయ్యాయి. అయినా సరే లక్ష్యాన్ని వీడకుండా ఫ్లో బస్సు ఆలోచనను వర్చువల్ రియాల్టీగా మార్చి ఇన్వెస్టర్లను ఆకర్షించాడు. బస్సులోపలి ప్రాంతం విద్యుత్ కోసం బస్సుపై 2కే సోలార్ ప్యానల్స్ అమర్చారు. సౌర విద్యుత్ ద్వారా బస్సు లోపల వినియోగించే టెక్నాలజీ పరికరాలన్నీ పనిచేసేలా రూపకల్పన చేశాడు.
రోబోటిక్, ఏఆర్, వీఆర్, త్రీడీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐవోటీ, ప్రోగ్రామింగ్ డ్రోన్స్, మేకర్ స్పేస్ సహా 10 రకాల జోన్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ బస్సులో పొందుపర్చారు. ఈ వినూత్న ఆవిష్కరణను ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించి ప్రశంసించారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తోపాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సైతం అభినందించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు మధులాశ్ బాబు.
పాఠశాలలు, కళాశాలల్లో ఇలాంటివి చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. యాజమాన్యాలు ఆ దిశగా కృషి చేయకపోవచ్చు. అందుకే రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలకు ఈ బస్సును తీసుకెళ్లడమే లక్ష్యంగా మధులాశ్ బృందం సన్నాహాలు చేస్తోంది. యాత్ర పేరుతో 5వ తరగతి నుంచి బీటెక్ విద్యార్థుల వరకు దీని గురించి తెలియజేసి కొత్త ఆలోచనలు రేకెత్తించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నామ మాత్రం రుసుముతో ఈ టెక్నాలజీని పరిచయం చేస్తామని చెబుతున్నారు. అయితే ఫ్లో బస్సును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కోరుతున్నాడు. ప్రతి జిల్లాలో ఇలాంటి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎడోధ్వజ అంకుర సంస్థ పనిచేస్తుంది. మధులాశ్ బాబుతోపాటు 18 మంది విద్యార్థులు నిరంతరం ఈ ఫ్లో బస్సు కోసం పనిచేస్తుండగా మరో ఐదుగురు ఆఫ్‌లైన్‌లో సేవలందిస్తున్నారు. సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు వెనుకబడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయోగం కచ్చితంగా సఫలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"కొత్తగా వస్తున్న టెక్నాలజీని విద్యార్థులు నేర్చుకోవాలంటే పాఠశాల, కళాశాల స్థాయిలో సరైన ల్యాబ్‌లు, మెంటర్స్ అందుబాటులో ఉండాలి. కానీ, మన వ్యవస్థలో ఆ విధానం లేదు. అందుకే మాకు ఈఆలోచన వచ్చింది. భవిష్యత్‌లో నేర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉంటుందో ముందే విద్యార్థులకు చూపించాలనే ఉద్దేశంతో మూడేళ్లు శ్రమించి ఈ ఫ్లో బస్సును తయారు చేశాము". - మధులాశ్ బాబు, సీఈవో, ఎడోధ్వజ ప్రైవేట్ లిమిటెడ్
YUVA: ఫర్నీచర్ వ్యాపారంలో రాణిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తున్న యువకుడు - young man excels in business
YUVA : మినియేచర్ క్రాఫ్ట్‌లో నైపుణ్యం- అందమైన వాహనాల నమూనాలకు జీవం పోస్తున్న సిద్దిపేట యువకుడు - miniature craft artist