Former MLA Shakeel Son Rahil Case Update :గత జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌ను ఈనెల 18 వరుకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో రాహిల్‌కు బెయిల్ రావడంతో గత వారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. 2022లో జరిగిన జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బాధితుల నుంచి మరోసారి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదం మాదిరిగానే జూబ్లీహిల్స్ కేసులోనూ మరో వ్యక్తిని డ్రైవర్‌గా రాహిల్ పంపించాడని పోలీసుల దర్యాప్తులో తెలింది. ఈ కేసులో ఓ చిన్నారి మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీస్ అధికారుల వాంగ్మూలాన్ని ఉన్నతాధికారులు నమోదు చేశారు. అప్పటి పోలీసులు రాహిల్‌ను తప్పించే ప్రయత్నం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. వారి పాత్ర ఉన్నట్లు తేలితే అప్పటి జూబ్లీహిల్స్ పోలీసులపై అధికారులు చర్యలు తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rahil Granted Conditional Bail : గతేడాది డిసెంబర్‌లో ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాహిల్‌ను ఈ నెల 8న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన అతడు, దుబాయ్(Dubai) నుంచి హైదరాబాద్‌కు రాగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే రాహిల్‌ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.