తెలంగాణ

telangana

ETV Bharat / state

మా సహనాన్ని పరీక్షిస్తే భవిష్యత్‌లో చర్యకు ప్రతిచర్య ఉంటుంది - కేటీఆర్ వార్నింగ్ - KTR about Attack on Journalists - KTR ABOUT ATTACK ON JOURNALISTS

KTR On CM Revanth : రుణమాఫీపై చర్చకు రావాలని తాను సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్​ విసిరితే, దిల్లీకి పారిపోయారని మాజీమంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. సీఎం నియోజకవర్గంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు రుణమాఫీ గురించి అడిగితే వారిపై కాంగ్రెస్​ గుండాలు దాడి చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు భవిష్యత్‌లో చర్యకు ప్రతిచర్య ఉంటుందని, తిరుమలగిరిలో జరిగిన ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

KTR On women Journalist Incident
KTR On CM Revanth (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 5:24 PM IST

KTR On women Journalist Attack Incident : రుణమాఫీపై చర్చకు రావాలని తాము సీఎం రేవంత్‌రెడ్డికి సవాలు విసిరితే ఆయన దిల్లీకి పారిపోయారని మాజీమంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు రుణమాఫీ గురించి అడిగితే వారిపై కాంగ్రెస్‌ గుండాలు దాడి చేశారని ధ్వజమెత్తారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి డిమాండ్​ చేశారు. రుణమాఫీ వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

భవిష్యత్‌లో చర్యకు ప్రతిచర్య ఉంటుందని డీజీపీకి ఫిర్యాదు చేశామని కేటీఆర్​ తెలిపారు. తమ సహనాన్ని పరీక్షిస్తే చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. కొందరు పోలీసు అధికారులను మంత్రుల బర్త్‌డే కార్యక్రమాల్లో తరిలిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా ఉన్న భవనాలన్నీ కూల్చాల్సిందేనని ఉద్ఘాటించారు. పొంగులేటి, వివేక్, మధుయాస్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి భవనాలు కూడా కూల్చాల్సిందేనని వ్యాఖ్యానించారు.

బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చింది : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రైతుల రుణమాఫీపై బీఆర్​ఎస్​ నిరసన చేస్తుంటే కాంగ్రెస్​ నేతలు దాడులు చేస్తున్నారని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలు తిరగబడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా మిగిలే వారు కాదని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తాము పదేళ్లుగా స్వచ్ఛందంగా పరిపాలించామని పేర్కొన్నారు.

అంతకముందు కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు డీజీపీని కలిసి గురువారం జరిగిన తిరుమలగిరి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ధర్నా శిబిరంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారని, కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ధర్నా శిబిరాన్ని పోలీసులే తొలగించారని డీజీపీకి వివరించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తుస్తున్నారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి "చలో దిల్లీ కాదు చలో పల్లె" చేపట్టాలి : కేటీఆర్ ట్వీట్ - KTR SLAMS CM REVANTH REDDY

కొర్రీలొద్దు, కోతలొద్దు - అర్హులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేయాల్సిందే : బీఆర్ఎస్ - BRS Dharna For Complete Loan Waiver

ABOUT THE AUTHOR

...view details