Daggubati Venkateswara Rao Met CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిశారు. ఆయన రచించిన "ప్రపంచ చరిత్ర" (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు.
సీఎం చంద్రబాబును కలిసిన దగ్గుబాటి - పుస్తకావిష్కరణకు ఆహ్వానం - DAGGUBATI VENKATESWARA RAO MET CM
చాలా కాలం తర్వాత తోడల్లుళ్లు కలుసుకోవడంపై రాజకీయ ప్రాధాన్యత - తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణకు ఆహ్వానం

Daggubati Venkateswara Rao (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2025, 9:26 AM IST
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండవల్లిలో తొలిసారి చంద్రబాబు నివాసానికి వచ్చారు. చాలా కాలం తర్వాత ఇద్దరు తొడల్లుళ్లు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పుస్తకావిష్కరణకు చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు.