VIJAY PAUL IN RAGHURAMA TORTURE CASE : ఉప సభాపతి రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉన్న సమయంలో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను మరోసారి విచారించారు. రిమాండ్‌లో ఉన్న ఆయన్ను రెండు రోజులు పాటు పోలీస్ విచారణకు కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలసిందే. ఇందులో భాగంగా కేసుకు విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దమోదర్ శుక్రవారం దాదాపు ఏడు గంటలపాటు తన కార్యాలయంలో విచారించారు.
విచారణ సమయంలో విజయ్‌పాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని, మంచిగానే నడిచారని రిమాండ్‌కు తరలించేటప్పుడు మాత్రం గాయాలపాలై నడవలేకపోయారని, ఈ మధ్యలో ఏం జరిగింది? రఘరామకు గాయాలు ఎలా అయ్యాయి? అని ప్రశ్నించారు. ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? అని అడుగ్గా ఎవరకూ కొట్టలేదని, వచ్చినప్పుడే దెబ్బలు తగిలివుంటాయని భావిస్తున్నామని విజయ్‌పాల్ సమాధానం చెప్పినట్లు తెలిసింది.
రఘురామకృష్ణం రాజు సీఐడీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా వచ్చారని, తిరిగి వెళ్లేటప్పుడు దెబ్బలతో వచ్చినట్లు సాక్ష్యాలు వున్నాయని, నలుగురు వ్యక్తులు ముసుగు వేసుకొని వచ్చారు కదా? ఎవరు వారు అని ప్రశ్నిస్తే, తనకు తెలీదని పాత పాటనే వల్లివేసారు. ఎస్పీ వేసిన అనేక ప్రశ్నలకు తప్పించుకునే విధంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.