తెలంగాణ

telangana

ETV Bharat / state

మయోనైజ్ తిని మరొకరి మృతి, 20మందికి అస్వస్థత - రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు జాగ్రత్త! - GRILL 9 RESTAURANT SEIZE IN NIRMAL

మయోనైజ్​పై నిషేధం విధించినా పట్టించుకోని రెస్టారెంట్లు - నిర్మల్​లోని ఓ రెస్టారెంట్​లో తిన్నాక ఒకరి మృతి, 20మందికి అస్వస్థత - రెస్టారెంట్​ సీజ్​ చేసిన ఫుడ్​ సేఫ్టీ అధికారులు

Grill 9 restaurant Seize In Nirmal
Grill 9 restaurant Seize In Nirmal (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 5:02 PM IST

Updated : Nov 7, 2024, 5:28 PM IST

Grill 9 restaurant Seize In Nirmal :మండీ బిర్యానీలో ఇష్టంగా తినే మయోనైజ్ తయారీలో నాణ్యత పాటించకపోవడం వల్ల ఇటీవల చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. హైదరాబాద్​లో ఇటీవలే కలుషితమైన మయోనైజ్ తిని ఒకరు చనిపోగా 50 మంది ఆసుపత్రిలో చేరారు. నగరంలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరగడంతో ప్రభుత్వం ఇటీవల మయోనైజ్​పై ఏడాది కాలం నిషేధం విధించింది. అయినా రెస్టారెంట్లు సర్కార్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. చాలా రెస్టారెంట్లలో మయోనైజ్​ను ఇంకా వాడుతూనే ఉన్నారు. కస్టమర్లు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడటం లేదు. ఇలాగే నాణ్యతలేని మయోనైజ్ తిని నిర్మల్​ పట్టణంలో ఒకరు చనిపోగా, 20 మంది ఆసుపత్రి పాలయ్యారు.

అసలేం జరిగిందంటే : నిర్మల్​ పట్టణంలోని గ్రిల్ 9 రెస్టారెంట్​లో ఈనెల 2 పలువురు కస్టమర్లు బిర్యానీ తిన్నారు. తరువాత వీరిలో 20మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు బోథ్​కు చెందిన ఓ మహిళ ఇదే రెస్టారెంట్​లో తిన్న తరువాత ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. పలువురు ఆసుపత్రిలో చేరాలన్న సమాచారంతో నిర్వాహకులు సోమవారమే రెస్టారెంట్ మూసేశారు.

అదే రోజు రెస్టారెంట్​లోని సీసీ ఫుటేజ్​ తీసుకెళ్లి ఆధారాలు లేకుండా చేశారు. విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను పట్టుకున్నారు. ఇవాళ ఫుడ్​ సేఫ్టీ అధికారులు.. పోలీసులు, నిందితుల సమక్షంలో రెస్టారెంట్​ను తనిఖీ చేశారు. ఏమాత్రం పరిశుభ్రంగా లేని కిచెన్, జిడ్డుకారుతున్న వంట పాత్రలు, పడేపడే వాడుతున్న ఆయిల్, ఎక్స్​పైర్ అయిన సరుకులను గుర్తించారు. తరువాత మున్సిపల్ అధికారులతో కలిసి ఇంఛార్జ్ ఫుడ్ ఇన్​స్పెక్టర్ ప్రత్యూష రెస్టారెంట్​ను సీజ్ చేశారు.

"హోటల్​ నిర్వాహకులకు మయోనైజ్​ వాడకూడదని సూచించినప్పటికీ వారు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులు మయోనైజ్​ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. బాధ్యులపై కేసు నమోదు చేశాం "- ప్రత్యూష, ఫుడ్ ఇన్​స్పెక్టర్​

హోటల్​ నిర్వాహకుడిపై కేసు :హోటల్లోని కాలం చెల్లిన సరుకులు, ఇతర ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపుతున్నట్లు ఇంఛార్జ్ ఫుడ్ ఇన్​స్పెక్టర్ తెలిపారు. బిర్యానీ, షవర్మాలో మయోనైజ్ తిన్న తరువాతే తాము అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పారని ఆమె చెప్పారు. గ్రిల్ 9 నిర్వాహకుల లైసెన్స్​ కూడా రెన్యువల్ కాలేదని అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజన్​కు కారణమైన నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ప్రాణాలు హరించేస్తున్న మయోనైజ్ :ఉడికించని పదార్థమైనందున మయోనైజ్‌లో హానికరమైన బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. చట్నీగా ఉపయోగించే మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నూనె, ఉప్పు, నిమ్మరసం, తయారు చేస్తారు. తయారు చేసిన వెంటనే వడ్డించకుండా నిల్వ ఉంచి తింటే అనారోగ్యం పాలవడం గ్యారెంటీ.

టేస్టీగా, టెంప్టింగ్​గా ఉందని బయట తింటున్నారా? - ఆ టేస్ట్ అంతా 'కల్తీ' అంట! జర చూస్కోండి మరి

బార్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో చికెన్ తింటున్నారా? - అది కుళ్లిన మాంసమని మీకు తెలుసా!

Last Updated : Nov 7, 2024, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details