ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య - రాష్ట్రంలో విమాన సర్వీసులకు అంతరాయం - Some Flights Were Delayed - SOME FLIGHTS WERE DELAYED

Flights Were Delayed at Gannavaram Airport: విమానయాన సంస్థ సర్వర్​లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మాన్యువల్​ బోర్డింగ్​ను అధికారులు చేపట్టారు. ఆన్‌లైన్ టికెట్‌ బుకింగ్స్‌ను రద్దు చేసి మాన్యువల్ రూపంలో టికెట్లు ఇస్తున్నట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో విశాఖలో నాలుగు ఇండిగో విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Flights Were Delayed at Gannavaram Airport
Flights Were Delayed at Gannavaram Airport (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 8:16 PM IST

Flights Were Delayed at Gannavaram Airport: విజయవాడ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. విమానయాన సంస్థ సర్వర్​లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మాన్యువల్​ బోర్డింగ్​ను అధికారులు చేపట్టారు. విమానాశ్రయంలో ఆన్‌లైన్ టికెట్‌ బుకింగ్స్‌ను రద్దు చేసి మాన్యువల్ రూపంలో టికెట్లు ఇస్తున్నట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. మాన్యువల్ విధానంలోనే ప్రయాణికులను విమానంలోకి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కంప్యూటర్‌తో అనుసంధానమై జరిగే అన్ని పనుల్లోనూ సేవలకు ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రయాణికుల లగేజ్‌ బార్ కోడింగ్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు.

విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం - CARGO SERVICE IN Vijayawada AIRPORT

Four Indigo Flights Cancel in Visakha Airport: మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో విశాఖలో నాలుగు ఇండిగో విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, కోల్‌కతా, ఒడిశాలోని జైపూర్‌కు వెళ్లాల్సిన 4 ఇండిగో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా నడిచే సర్వీసులు వాతావరణ మార్పుల కారణంగా 10- 20 నిమిషాల ఆలస్యం అవుతున్నట్లు విమానశ్రయ డైరెక్టర్ లక్ష్మికాంతరెడ్డి వెల్లడించారు. గన్నవరం నుంచి వెళ్లే విమానాల్లో పెద్దగా ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే సర్వీసుల్లో ఎటువంటి మార్పు లేదని డైరెక్టర్ స్పష్టం చేశారు.

విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత - ప్రాణాలు కాపాడిన నారా భువనేశ్వరి - NARA BHUVANESWARI SAVED THE LIFE

ABOUT THE AUTHOR

...view details