Five Years Old Boy Missing in Hospital Found Safe in Doctor Room : మాటలు రాని, వినపడని ఓ ఐదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. తల్లిదండ్రులను, ఆసుపత్రి సిబ్బందిని ఆందోళనకు గురి చేసిన ఈ ఘటనలో బాలుడు సురక్షితంగా (Safe) ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే,
kurnool sarvajana hospital :ఏపీలోనికర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కుమారుడు సుజిత్ (5)కు పుట్టుకతో మూగ, చెవుడు. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స నిమిత్తం 20 రోజుల కిందట కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న ఎనస్థీషియా (Anesthesia) విభాగాధిపతి గదిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది అదే సమయంలో ఆ గదిని శుభ్రం చేసి చిన్నారిని గమనించకుండా తాళం (Lock) వేసుకుని వెళ్లిపోయారు. ఆపై బయట నుంచి వచ్చిన తల్లి మౌనిక కుమారుడు కనపడకపోవడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
బెంగళూరులో బాలుడు మిస్సింగ్- హైదరాబాద్ మెట్రోలో ప్రత్యక్షం