Five NRIs Released From Dubai Jail Returned To India :ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి హత్య కేసులో ఇరుక్కుని 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఐదుగురు వ్యక్తులకు అక్కడి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. ఎట్టకేలకు ఆ వలస కార్మికులు సొంత ఊరికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు కూలీ చేసుకోడానికి దుబాయ్ వెళ్లారు. నేపాల్‌కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కోగా, తెలంగాణకు చెందిన ఈ ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్లు జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు, నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది.
ఒక తండ్రి ఐడియా.. వలస పిల్లల జీవితాలనే మార్చేసిందిగా
ఈ విషయం ఈనాడు దినపత్రిక ద్వారా 2011లో కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో వారిని రప్పించేందుకు యత్నం చేశారు. స్వయంగా నేపాల్‌కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో జాప్యం జరిగింది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్ న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు. మరోసారి బాధితుడి అనారోగ్య కారణాలను చూపుతూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. వారి దీనస్థితిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆర్ క్షమాభిక్ష కింద విడిపించేందుకు ప్రయత్నించారు.