ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వామ్మో! కిలోమీటరు పొడవైన భారీ వల - ఒక్కసారి వేస్తే 50 టన్నుల చేపలు - FISHERMEN FISHING WITH AILA NET

సూర్యలంక తీరంలో 'ఐలా' వలలతో మొదలైన చేపల వేట - సముద్రంలో రెండు నుంచి ఐదు కి.మీ దూరం తీసుకెళ్లి నేర్పుగా వేట

Fishermen Fishing With Aila Nets in Suryalanka Coast
Fishermen Fishing With Aila Nets in Suryalanka Coast (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 10:07 AM IST

Fishermen Fishing With Aila Nets in Suryalanka Coast : బాపట్ల సమీపంలో ఉన్న సూర్యలంక తీరంలో 'ఐలా' వలలతో చేపల వేట సందడి మొదలైంది. ఈ ఐలా వల పొడవు కిలోమీటరు వరకు ఉండి ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ చేస్తుంది. ఇలాంటి వలలతో వేట సాగించడం సూర్యలంక తీరం ప్రత్యేకత. ఈ ఒక్కో వలపై దాదాపు 200 నుంచి 250 మంది మత్స్యకారులు ఆధారపడతారు. ప్రధానంగా పక్కె, మత్తి చేపలు ఈ వలలో చిక్కుకుంటాయి. ఈ భారీ ఐలా వలను మొదట 70 నుంచి 80 మంది మత్స్యకారులు మోసి వేట పడవలో ఉంచుతారు. అనంతరం సముద్రంలో రెండు నుంచి ఐదు కి.మీ.దూరం వరకు తీసుకెళ్లి నేర్పుగా వేట సాగిస్తారు.

ఈ ఐలా వలను ఒక్కసారి సముద్రంలో వేస్తే కనిష్ఠంగా 5 నుంచి గరిష్ఠంగా 50 టన్నుల వరకు చేపలు పడతాయి. చేపల వేట కోసం సముద్రంలో వేసిన వలను బయటకు లాగటానికి సైతం ఇతర ప్రాంతాల నుంచి మరో 150 మంది కూలీలను తెచ్చుకుంటారు. అనంతరం ఆ చేపలను తీరంలో కుప్పలుగా పోసి వ్యాపారులకు విక్రయిస్తారు. ఈ చేపలను కొన్న వ్యాపారులు వీటిని తమిళనాడు,కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం ఆరంభంలోనే మత్స్యకారులు గంగమ్మకు పూజలు చేసి 'ఐలా' వలలతో చేపల వేటను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details