ETV Bharat / state

నెల రోజులుగా జ్వరాలు, కీళ్లనొప్పులు - ఆ గ్రామానికి ఏమైంది? - VIRAL FEVERS IN KRISHNA DISTRICT

జ్వరాలు, కీళ్లనొప్పులు, దగ్గు, జలుబుతో నెల రోజులుగా అల్లాడుతున్న గొడవర్రు గ్రామస్థులు - వైద్యసిబ్బందికి తెలిసిన పట్టించుకోవడం లేదని ఆరోపణ

Viral Fevers in Krishna District
Viral Fevers in Krishna District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

Viral Fevers in Krishna District : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గొడవర్రు గ్రామంలో ప్రజలు గత నెల రోజులుగా జ్వరాలు, కీళ్లనొప్పులు, దగ్గు, జలుబుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ సమస్య నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఉంది. కేవలం గొడవర్రు గ్రామంలోని గౌడ బజార్ ఒక్కదానిలోనే సుమారు 35 మంది ఈ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.

స్పందించని వైద్య సిబ్బంది : ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఈ సమస్య గురించి తెలియజేసినా సాధారణ మందులతోనే కాలం వెళ్లదీస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అంతేకాక ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది తగిన విధంగా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టామని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

"గొడవర్రు గ్రామంలో నెలరోజుల నుంచి విషజ్వరాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్క గౌడ బజార్​లోనే దాదాపు 35 మంది ఇబ్బందులు పడుతున్నారు. కాళ్లు, కీళ్లనొప్పులు, వాపులు, దగ్గు, జలుబుతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల రుపాయాలు ఖర్చు పెట్టుకున్నాం. రోజు రోజుకు బాధితులు సంఖ్య పెరుగుతునే ఉంది. వైద్య సిబ్బందికి ఈ విషయం తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - గొడవర్రు గ్రామస్థులు

విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య - Viral Fevers Tension In AP

రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు - బాధితులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు - Viral Fevers Tension In AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.