Pawan Kalyan comments on Tirumala Stampede Incident: తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. జరిగిన దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఘటనపై టీటీడీ ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్‌మెంట్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నామని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించినప్పుడు తప్పు జరిగింది క్షమించమని అడిగానని పవన్ తెలిపారు. అలానే మృతుల కుటుంబాలకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలని అన్నారు
సామాన్యులపై టీటీడీ దృష్టిపెట్టాలి: వీఐపీలపై కాదు సామాన్యులపై టీటీడీ దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు ఎదురుచూసే పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. సాధ్యమైతే 1 లేదా 2 గంటల్లో దర్శనం జరిగేలా చూడాలని అన్నారు. ఇంతమంది అధికారులు, పోలీసులు ఉన్నా తప్పు ఎందుకు జరిగిందని పవన్ ప్రశ్నించారు. తొక్కిసలాట జరిగితే సహాయ చర్యలు ఎలా ఉండాలనే ముందస్తు ప్రణాళిక లేదని మండిపడ్డారు. వ్యక్తులు చేసిన తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. ఇది కావాలని చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అనుమానాలపై విచారణ జరగాల్సి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
కొందరు పోలీసులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇకపై పోలీసులు తీరు మార్చుకోవాలి. నా ప్రెస్‌మీట్ వేళ కూడా పోలీసులు సరిగా వ్యవహరించలేదు. కావాలనే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వందల మంది పోలీసులున్నా తొక్కిసలాట ఎలా జరిగింది. పోలీసుశాఖ నిర్లక్ష్యంపై సీఎం, డీజీపీ దృష్టికి మళ్లీ తీసుకెళ్తా. ఘటనాస్థలిలో ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలి.- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
తిరుపతి ఘటన - ఇద్దరు అధికారులు సస్పెన్షన్ - ఎస్పీ, జేఈవో గౌతమి బదిలీ: చంద్రబాబు
Pawan Kalyan Visit Tirumala Stampede area: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కల్యాణ్‌కు వివరించారు.
భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్క్‌కు వచ్చారని అధికారులు వివరించారు. అక్కడి నుంచి పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లిన పవన్ కల్యాణ్ తోపులాట ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులకు పరామర్శించారు.
భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారు?- అధికారులపై చంద్రబాబు ఆగ్రహం
తిరుపతిలో తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం