Minister Ram Prasad Reddy on Sankranti Busses: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి సంక్రాంతికి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గతంలో పండగ ప్రత్యేక సర్వీసులు అంటే ప్రయాణికులపై అదనపు బాదుడు ఉండేదని కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులపై అదనపు భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రైవేటు సర్వీసులలో కూడా ఆర్టీసీతో సమానంగా టికెట్ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అతి త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించారు.
దిల్లీలో గడ్కరితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాయలసీమలో కొన్ని రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చేందుకు సానుకూలంగా స్పందించారని అన్నారు.
శవంతోనే రాజకీయం ప్రారంభించిన జగన్: జగన్మోహన్ రెడ్డి మాటలు చెల్లని రూపాయిగా మారాయని మండిపడ్డారు. దురదృష్టవశాత్తు జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటననూ రాజకీయం చేయాలని జగన్ చూడటం సరికాదని హితవు పలికారు. తండ్రి శవంతోనే రాజకీయం ప్రారంభించిన జగన్ సీఎం అయ్యేందుకు బాబాయ్ శవాన్ని వాడుకున్నాడని విమర్శించారు. శవరాజకీయాలను పేటెంట్గా తీసుకున్న జగన్ ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వాలటమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు.
తిరుపతిలో సీఎం చంద్రబాబు - టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం
జేబు కొట్టేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ - పండుగ వేళ ప్రయాణికులకు షాక్