తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు - చూస్తుండగానే అన్నీ బుగ్గిపాలు

జహీరాబాద్ బైపాస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం - కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో చెలరేగిన మంటలు - 8 కార్లు దగ్ధం

8 CAR BURNT IN ZAHEERABAD
Fire accident in Transport Container in Zaheerabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 4:43 PM IST

Updated : Nov 10, 2024, 6:41 PM IST

Fire accident in Transport Container in Zaheerabad :సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్​లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కంటైనర్​లో తరలిస్తున్న 8 కార్లు కాలి బూడిదయ్యాయి. టాటా నెక్సన్ మోడల్​కు చెందిన కార్లను ముంబయి నుంచి హైదరాబాద్ రవాణా చేస్తుండగా బైపాస్ రోడ్డులో రంజోల్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది.

జహీరాబాద్ అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజిన్ సహా మహేంద్ర అండ్ మహీంద్రా కర్మాగారం ఫైర్ ఇంజిన్​ సిబ్బంది తొలుత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో ముంబయి - హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా రాకపోకలు స్తంభించాయి. ప్రమాదంలో అగ్నికీలలు ఎగిసిపడి కార్లలోని సామగ్రి భారీ శబ్దాలతో గాల్లోకి ఎగిరి పడ్డాయి.

Fire Explosion in Jubilee Hills :ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్‌-9లో భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టారెంట్‌లో కంప్రెసర్‌ పేలడంతో ప్రహారి కూలిపోయింది. దీంతో రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న దుర్గాభవాని నగర్‌ బస్తీలో పడడంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ యువతికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్తీ వాసులు నిద్రపోతుండటంతో తీవ్రత తగ్గినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై క్లూస్‌ టీమ్‌, బాంబ్‌స్క్వాడ్‌ ఆధారాలు సేకరించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Fire Accident in Jewellery Shop in Khammam: శనివారం ఖమ్మం జిల్లా ఇల్లందులో పూజ జ్యువెల్లరీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు జ్యువెల్లరీ షాప్​ యజమాని, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సీసీటీవీ కెమెరాలతోపాటు ఒక టీవీ, కొంత ఫర్నిటచర్​ దగ్ధమైంది. సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. విద్యుదాఘాతం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు బాధితులు చెప్పారు.

హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం - బాణసంచా పేలి దంపతులు మృతి

పెట్రోల్ పోస్తుండగా నిప్పంటించిన ఆకతాయిలు - ఆ తరువాత ఏమైందంటే?

Last Updated : Nov 10, 2024, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details