Fire Accident in Pahal Foods Factory in Telangana:తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో తెల్లవారుజామును మంటలు చేలరేగాయి. క్రమంగా మంటలు ఫ్యాక్టరీలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన సిబ్బంది అప్రమత్తమై బయటికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద సమయంలో విధుల్లో వంద మంది వరకు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణనష్టం - FIRE ACCIDENT IN KATTEDAN
Fire Accident in Pahal Foods Factory in Telangana: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పహల్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు.
Fir_accident
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 10:35 AM IST
అనంతరం సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. పై అంతస్తులో ప్యాకింగ్ సామగ్రి ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. మరోవైపు అగ్నిప్రమాదం (Fire Accidents in Telangana) ధాటికి పగుళ్లతో పూర్తిగా భవనం పక్కకు ఒరిగిపోయింది.