Fire Accident In Cotton Warehouse : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పూడూరు పరిధిలోని పత్తిగోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తిని నిల్వ చేసినటువంటి గోదాంలో శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోదాం పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. కాగా ఇందులో నిల్వ ఉంచిన పత్తి పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
గోదాం గేటుకు వెల్డర్ మరమ్మత్తులు చేస్తుండగా నిప్పురవ్వలు(మెరుపులు) ఎగిరి పత్తిలో పడడంతో మంటలు అంటుకున్నట్టుగా స్థానికులు తెలిపారు. కాగా సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక నిరోధక శాఖ అధికారులు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కాగా దగ్ధమైన పత్తి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ బ్రాంచ్‌కు చెందినదిగా సమాచారం.