Rythu Bheema Fraud By Creating Fake Certificate :రైతు బీమా సొమ్మును కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు ఆ ఇద్దరు రైతులు. బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి, నామినీలుగా ఉన్న భార్యల బొట్టు, గాజులు తీసేసి అధికారులను ఏమార్చి సినీ ఫక్కీలో డబ్బులు నొక్కేశారు. ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున బీమా, ఎక్స్‌గ్రేషియా, మంజీరా బ్యాంకులో తలా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను కాజేసిన ఘటన మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను, ఎలిగేడి మల్లేశం అనే రైతులు రైతు బీమా పథకం డబ్బులు నొక్కేయాలని ప్లాన్ చేశారు. అందుకు బతికున్న తాము చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాలి అనుకున్నారు. పిట్ల శ్రీను 2021 మే 22వ తేదీన చనిపోయినట్లు అప్పటి కార్యదర్శి ప్రభాకర్ సహకారంతో డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. అదేవిధంగా ఎలిగేటి మల్లేశం 2023 ఫిబ్రవరి 7వ తేదీన చనిపోయినట్లు ప్రస్తుత పంచాయతీ సెక్రటరీ నరేందర్ సహకారంతో డెత్ సర్టిఫికెట్స్ తీశారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. పిట్ల శ్రీను భార్య జ్యోతికి రైతు బీమా పథకం ద్వారా 2021 జులై 26న రూ.5 లక్షలు, ఎలిగేటి మల్లేశం భార్య శేఖవ్వకు 2023 మార్చి 29న రూ.5 లక్షలు లబ్ధి చేకూరింది.
'మీకు ఇల్లు వచ్చింది - ఇదిగో పత్రాలు తీసుకోండి' - హైదరాబాద్లో 'డబుల్' మోసం