Farmers drained the rain water and used it as irrigation water in Hanamkonda :హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామ శివారులోని వ్యవసాయ భూముల మధ్య గుట్టలు ఉన్నాయి. వ్యవసాయానికి అనువైన భూములు ఉన్నా, సాగునీరు లేక పంటలు పండించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వర్షం వచ్చినప్పుడు గుట్టల మీదపడిన వర్షపు నీరు వృథాగా పోయేది. గుట్టల సమీపంలో తెనుగువారికుంట ఉన్నప్పటికీ, ఎక్కువ లోతు లేకపోవడంతో నీరు కుంట నిండి వృథాగా పోయేది.
వర్షపు నీటిని కాపాడుకోవాలని ఆలోచించిన రైతులు, స్థానిక ఫీల్డ్ ఆఫీసర్ సహకారంతో ఉపాధి హామీ పథకాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మలచుకున్నారు. నీటి సామర్థ్యం పెంచేందుకు కుంటను అభివృద్ది చేసి వర్షపు నీటిని కుంటలోకి మళ్లించే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సుమారు 250 ఎకరాల్లో వంద మంది రైతులు ఈ కుంటలోని నీటి వనరుని ఉపయోగించుకుని పంటలు పండిస్తున్నారు. పది సంవత్సరాల కింద ఖాళీగా ఉండే కుంట, అటువంటి కుంటను మంచి స్థాయికి మెరుగుపరిచామని రైతులు చెబుతున్నారు.
'వర్షం పడినప్పుడు కాకుండా మామూలుగా నీళ్లు లేక పొలం పండించడానికి ఇబ్బందిగా ఉండేది. గుట్ట చుట్టూ కాంటూర్ కంటిన్యూస్టెన్స్ గుంతలు తీయడం వల్ల చెరువు కూడా కొంచెం అభివృద్ధి అయింది. నీళ్లు వృథా కాకుండా చెరువులోకి తీసుకొచ్చేలా గుట్ట చుట్టూ కాంటూర్ కంటిన్యూస్టెన్స్ గుంతలు తీశారు. దీని వల్ల నీటి ఇబ్బంది లేదు. పంటలు కూడా బాగా పండుతున్నాయి. - రైతులు