Farmer Died in Elephant Attack in Komaram Bheem :తెలంగాణలో మొదటిసారి ఏనుగుల దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. రైతుపై దాడి చేయడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి మండలంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు బూరేపల్లి గ్రామ శివారులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న మిర్చితోటలోకి ప్రవేశించిన ఏనుగు ఆ తోటలో పని చేస్తున్న అన్నూరి శంకర్ అనే రైతుపై దాడి చేసింది. ఈ దాడిలో రైతు శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు, పోలీసులు సమాచారం అందించారు. గ్రామ శివారులోకి ఏనుగు రావడంతో స్థానికులందరూ భయాందోళనలకు గురయ్యారు. రైతు మృతి చెందడంలో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంకా ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.