Family Members Suicide Attempt due to Money Problems in Tenali :ఓ వైపు అప్పుల బాధ, మరో వైపు కుమార్తెకు కట్నం తీసుకురావాలని అత్తమామల వేధింపులు. ఈ రెండింటితో సతమతమైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి చేయగా బంధువులు వారిని గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్‌రావు భార్య నాగమణి మృతి చెందారు. కుమార్తె హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వైసీపీ కౌన్సిలర్ వేధిస్తున్నారని అటెండర్ ఆత్మహత్యాయత్నం - సెల్ఫీ వీడియో
Family suicide Attempt at Guntur District: బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని నాజర్‌పేటకు చెందిన శివశంకర్‌రావు, భార్య నాగమణి, కుమార్తె హరిక ముగ్గురు అప్పులు తీర్చలేక ఆత్మహత్యయత్యానికి పాల్పడ్డారు. పాల వ్యాపారం చేస్తున్న శివశంకర్‌రావు తన బిజినెస్ సరిగా లేకపోవడంతో రైల్యే స్టేషన్ వద్ద టీ స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. కుమార్తె పెళ్లి కోసమని డబ్బులు అప్పు తెచ్చిన అతడు తీర్చడానికి నానా అవస్థలు పడినట్లు పేర్కొన్నాడు. కట్నం కోసమని అల్లుడు, అత్తామామలు తనని వేధిస్తున్నట్లు కుమార్తె తండ్రితో చెప్పినట్లు అతడు వివరించాడు. వివాహానికి చేసిన అప్పులు తీరక, మరో వైపు హరికను అత్తింటి వారు వేధించడం తనని మరింత మానసిక స్థితికి గురి చేసినట్లు పేర్కొన్నాడు.
ప్రేమ పేరుతో యువతి మోసం: యువకుడి ఆత్మహత్యాయత్నం