Family Members of Youth Protested After Arrest by Police in Jagan Attack Case:ముఖ్యమంత్రి జగన్‌పై రాయిదాడి కేసులో విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ చిన్నారులతో కలిసి సీపీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీవాసుల్లో ఇంకా భయం వీడలేదు. ఏ క్షణం పోలీసులు వచ్చి ఎవరిని తీసుకెళ్తారోనని ఆందోళన చెందుతున్నారు. సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం రెండురోజులు అవుతున్నా ఇంకా వారు ఎక్కడ ఉన్నారో కనీసం కుటుంబ సభ్యులకు ఆచూకీ చెప్పకపోవడంతో వారంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దుర్గారావు కుమార్తెలు తండ్రి జాడ కోసం వెక్కివెక్కి ఏడ్వటం చూస్తే ఎంతో జాలివేస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన రోజు దుర్గారావు అసలు ఇంటి నుంచి బయటే వెళ్లలేదని ఏ ఆధారం లేకుండా పోలీసులు ఎలా తీసుకెళ్తారని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
'శివ అన్నపురెడ్డి’ ఫేస్‌బుక్ ఖాతా - మొన్న కనిపించింది - నిన్న మాయమైంది - shiva annapureddy facebook
పోలీసులు అదుపులోకి తీసుకున్న తమ వారిని చూపించాలంటూ సింగ్‌నగర్ వడ్డెర కాలనీవాసులు విజయవాడ సీపీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వారిని బలవంతంగా ఆటోలో ఎక్కించి నార్త్ జోన్ ఏసీపీ ఆఫీస్‌కు తరలించారు. ఏసీపీ వారితో కొద్దిసేపు మాట్లాడారు. కేసులో విచారణ జరుగుతోందని విచారణ పూర్తైన తరువాత నిజనిర్ధారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపినట్లు వడ్డెర కాలనీ వాసులు చెబుతున్నారు.