తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య - మృతుల్లో ఏడాది వయసున్న చిన్నారి - Family Members Mass Suicide - FAMILY MEMBERS MASS SUICIDE

Family Members Mass Suicide : కుటుంబ కలహాలు ఒకే కుటుంబానికి చెందిన ఓ మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మృతిచెందిన వారిలో అభంశుభం తెలియని ఓ ఏడాది వయసున్న ఓ చిన్నారి కూడా ఉండటం అందరినీ కలచివేసింది. ఈ విషాద ఘటన కరీంనగర్ శివారు బొమ్మకల్​లో జరిగింది.

Family Members  Mass Suicide
Family Members Mass Suicide

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 7:59 PM IST

Family Members Mass Suicide : కరీంనగర్‌ శివారు బొమ్మకల్ గ్రామంలో విషాదపు ఛాయలు అలుముకున్నాయి కుటుంబ కలహాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. బొమ్మకల్‌, విజయనగర్‌ కాలనీకి చెందిన శ్రీజకు మూడేళ్ల క్రితం వరంగల్ కు చెందిన నరేష్‌తో వివాహం జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన నరేష్‌ నిరంతరం భార్యతో గొడవ పడేవాడని మృతురాలి తండ్రి వెంకటేశ్వరాచారి పోలీసులకు(Police) ఫిర్యాదు చేశారు. పలుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికి నరేష్‌లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అల్లుడి వేధింపులు తట్టుకోలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి వెంకటేశ్వరాచారి మీడియాతో చెప్పారు.

3 Members Of Family Die By Suicide : అతనికి నచ్చ చెప్పేందుకు వెళ్లిన తమను కూడా దుర్భాషలాడే వాడని మృతురాలి తండ్రి పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం తన ఏడాది బాబుతో తల్లిగారింటికి శ్రీజ వచ్చిందని పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా డిప్రెషన్‌లో ఉన్న కూతురు శ్రీజ తన ఏడాది కుమారునికి విషపు గుళికలు ఇచ్చి తాను కూడా గోళీలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి జయప్రద కూడా క్రిమిసంహారక మందు తీసుకోవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి(Hospital) తరలించగా చికిత్సపొందుతూ ఆమె కూడా మరణించినట్లు వైద్యులు(Doctors) తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

"బొమ్మకల్ శివారులో శ్రీజ అనే 27 ఏళ్ల వివాహిత. ఆమెతో పాటు ఆమె ఒక సంవత్సరం చిన్నారి గుర్తుతెలియని మాత్రలు తిని ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారం మేరకు వారు ఉన్న ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఆసుపత్రికి తీసుకువచ్చేంతలోపే అప్పటికే వారిద్దరు చనిపోయినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. వారిద్దరిని మార్చురీకి తరలించడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి కూడా గుర్తు తెలియని మాత్రలు వేసుకోవడం వల్ల ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉంది. దీనిపై శ్రీజ తండ్రి పిటిషన్ ఇచ్చాక దర్యాప్తు చేపడతాం"-ప్రదీప్‌రావు,కరీంనగర్ రూరల్ సీఐ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య- మృతుల్లో ఏడాది వయసున్న చిన్నారి

Father and Two Daughters Suicide : పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణం!

Wife killed Husband in Medchal : నేను చెప్పినట్టు చేస్తావా.. చస్తావా..?

ABOUT THE AUTHOR

...view details