ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారులో తనిఖీలు - రూ. 50 లక్షలు దోపిడీ - Fake Police 50 lakh Robbery - FAKE POLICE 50 LAKH ROBBERY

Fake Police 50 lakh Robbery in Nellore District : పోలీస్ యూనిఫాంను అడ్డు పెట్టుకుని ఓ ముఠా రూ. 50 లక్షలు దొచుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. తనిఖీల పేరుతో ఓ కారులో నకిలీ పోలీసులు సోదాలు నిర్వహించగా ఈ డబ్బు బయటపడింది. దీంతో ముందే సిద్దం చేసుకున్న వాహనంలో డబ్బుతో పాటు పరారయ్యారు. వెంటనే తేరుకున్న బాధితులు వారు నకిలీ పోలీసులని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీల కోసం పోలీసులు గాలింపు చర్యలు మెుదలు పెట్టారు.

Fake Police 50 lakh Robbery in Nellore District
Fake Police 50 lakh Robbery in Nellore District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 7:39 PM IST

50 lakh Robbery in Nellore District : ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ పోలీసుల అవతారమెత్తి అమాయకులే లక్ష్యంగా అడ్డంగా దోచేస్తున్నారు. సినీఫక్కీనీ తలపించే విధంగా పోలీసులమంటూ వాహనాలను ఆపి తనిఖీల పేరిట కాసేపు హంగామా చేస్తారు. చివరికి దొరికిన కాడికి దోచుకెళ్తారు. అచ్చం ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. పోలీస్ యూనిఫాంను అడ్డు పెట్టుకుని ఓ ముఠా రూ. 50 లక్షలు దొచుకుని పరారైంది.

వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు నలుగురు వ్యక్తులు పుదుచ్చేరి నుంచి నుంచి కారులో వచ్చారు. సరిగ్గా పిడతపోలూరు వద్ద ఉన్న ఏపీ జెన్కో రోడ్డు వద్దకు వచ్చేసరికి నకిలీ పోలీసుల ముఠా ఆ కారును నిలిపి వేశారు. అనంతరం తనిఖీ చేయాలని కారులో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నకిలీ పోలీసులకు రూ. 50 లక్షలు కనిపించాయి. దీంతో ముందే సిద్దం చేసుకున్న వాహనంలో డబ్బుతో పాటు పరారయ్యారు. వెంటనే తేరుకున్న బాధితులు వారు నకిలీ పోలీసులని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ పోలీసుల కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details