తెలంగాణ

telangana

ETV Bharat / state

కేవలం పండించడంతోనే సరి - రైతుకు రూపాయిలో వచ్చేది ఎంతంటే!

మార్కెట్​లో ధరలు పెరుగుతున్నా ధర విషయంలో దగా పడుతున్న రైతు - అన్నదాతలకు రూపాయిలో దక్కేది 33 నుంచి 37 పైసలు మాత్రమే

Vegetable Inflation in India
Vegetable Inflation in India (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 3:53 PM IST

Updated : Oct 8, 2024, 4:18 PM IST

Vegetable Inflation in India : దేశానికి వెన్నెముక రైతన్న అని అంటుంటాం కదా మరి అలాంటి రైతుకు నేటికి మేలు మాత్రం జరగడం లేదు. పస్తులుంటూ కష్టపడి ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చెమటోడ్చి అన్నదాతలు పంటను పండిస్తున్నారు. కానీ దేశానికి ఆకలి తీర్చే రైతన్నకు మాత్రం మిగిలిందేమీ లేదు. రైతు ఎంత పండించిన చివరికి అతని మెడకు ఊరి, చేతికి అప్పు మాత్రమే మిగులుతున్నాయి. ఎందుకంటే పండించేది రైతు అయితే, లాభం గడించేది మాత్రం మధ్యవర్తులే. అసలు ఇంతకీ రైతుకు ఎంత డబ్బు వస్తుంది. మధ్యవర్తులకు ఎంత మొత్తం వెళుతుంది. రైతు నుంచి రిటైలర్​ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆర్​బీఐ కోసం ఓ నిపుణుల బృందం ఓ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో కీలక విషయాలు.. ఇలా ఉన్నాయి?

దేశంలో ప్రజలు అత్యధికంగా ఉపయోగించే టమాటా, ఆలుగడ్డ, ఉల్లి ధరలు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని వినియోగదారులు ఎక్కువ డబ్బులు చెల్లించి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ప్రకారం చూస్తే రైతుకు అధిక లాభాలు రావాలి. కానీ మధ్యవర్తులే లాభాలు గడిస్తున్నారు. అన్నదాతలకు రూపాయిలో 33 నుంచి 37 పైసలు మాత్రమే దక్కుతుంది. రూపాయిలో 63 నుంచి 67 పైసల వరకు రైతు నుంచి వ్యవసాయ మార్కెట్​లో దిగుబడులు కొనుగోలు చేసే ట్రేడర్లు, హోల్​సేల్​ వ్యాపారులు, రవాణా, రిటైలర్ల కమీషన్లు, లోడింగ్​, నిల్వ ఛార్జీలు, అన్​లోడింగ్​ రూపంలో పోతోంది. వీటి కారణంగా ధరలు పెరిగి వినియోదారుడిపై పెనుభారం అవుతున్నాయి.

ఆలుగడ్డ :

  • ఆలుగడ్డ ఉత్పత్తి 2014-15లో 48 మిలియన్​ టన్నులుండగా, 2022-23 నాటికి 60.1 మిలియన్​ టన్నులకు చేరింది.
  • సాగు వీస్తీర్ణం 20.7 లక్షల హెక్టార్ల నుంచి 23.3 లక్షల హెక్టార్లకు పెరిగింది.
  • ఈ మొత్తం ఉత్పత్తిలో యూపీలోనే రబీలో 32 శాతం రాగా, పశ్చిమ బెంగాల్​లో 24 శాతం, బిహార్​లో 16 శాతం, గుజరాత్​లో 7 శాతం ఉంది. వీటిని
  • పండించే వారిలో 86.7 శాతం మంది సన్నకారు రైతులే.
  • ఏపీఎంసీ మార్కెట్లలోని కోల్డ్​ స్టోరేజీ ప్లాంట్ల వద్ద వ్యాపారం జరుగుతుంది.
  • లేబర్​, రవాణా ఛార్జీలతో పాటు స్టోరేజీకి క్వింటాకు రూ.250 నుంచి రూ.260 వరకు రైతులు చెల్లించాలి.

ఉల్లి :

  • ఉల్లి ఉత్పత్తి 2014-15లో 18.9 మిలియన్​ టన్నులుండగా, 2022-23 నాటికి 30.2 మెట్రిక్​ టన్నులకు పెరిగింది.
  • సాగు విస్తీర్ణం 11.7 లక్షల హెక్టార్ల నుంచి 17.4 లక్షల హెక్టార్లకు పెరిగింది.
  • మొత్తం ఉల్లి ఉత్పత్తిలో 80 శాతం మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్​లలోనే ఉంది. 77 శాతం రబీలోనే వస్తుంది.
  • రబీలోనే వచ్చే ఉల్లిని మాత్రమే నిల్వ చేయగలరు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఈ నిల్వలు చాలా కీలకం కానున్నాయి.
  • ప్రభుత్వం నాఫెడ్​ ద్వారా సేకరించి, పంట తక్కువ వచ్చినప్పుడు విడుదల చేస్తుంది.
  • ఉల్లి క్వింటా దిగుబడికి ఖర్చు అతి తక్కువగా ఎంపీలో రూ.341.07 కాగా, అతి ఎక్కువ తమిళనాడు రూ.2305 గా ఉంది.
  • ఉల్లిని ఎక్కువగా ఏపీఎంసీ మార్కెట్‌లో బహిరంగ వేలం ద్వారా రైతుల నుంచి వ్యాపారులు కొంటారు. లేబర్‌ ఛార్జీలు, మండీలకు రవాణా ఛార్జీలను రైతులే భరించాల్సి ఉంటుంది.
  • వేలం ద్వారా కమీషన్‌ ఏజెంట్ల సాయంతో వ్యాపారులు తెచ్చుకొంటారు. మండి ఛార్జీలు 1 శాతం, కమీషన్‌ ఛార్జీలు 4 శాతం, లోడింగ్, అన్‌లోడింగ్‌ ఛార్జీలు క్వింటాలుకు రూ.9.02 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకింగ్, బరువు తగ్గితే వచ్చే నష్టం అధికం. ఇలాంటి నష్టం ఖరీఫ్‌లో 10 శాతం, రబీలో 5 శాతం ఉంటుంది.

గమనిక :ఉల్లిని కూడా మనదేశం ఎక్కువగా ఎగుమతులు చేస్తోంది. 2022-23లో 2.6 మిలియన్​ టన్నులు ఎగుమతి చేశారు. ఇది మొత్తం ఉత్పత్తిలో 8.6%. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్‌ తదితర దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. టమాటా, ఆలుగడ్డల ఎగుమతి మాత్రం రెండు శాతమే.

టమాటా :

  • టమాటాను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో ఎక్కువగా పండిస్తారు.
  • మొత్తం ఉత్పత్తిలో 67 శాతం రబీలోనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ఏడాదంతా పండిస్తారు. పశ్చిమబెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మాత్రం నవంబరు-జనవరి మధ్య పంట వస్తుంది.
  • మొత్తంగా 2014-15 నుంచి 2022-23కు మధ్య హెక్టారుకు దిగుబడి 21.3 టన్నుల నుంచి 24 టన్నులకు పెరిగింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు 27.3 టన్నుల నుంచి 43.3 టన్నులకు దిగుబడి పెరిగింది. ఇతర ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో మాత్రం దిగుబడి తగ్గింది.
  • నిపుణుల బృందం సభ్యులు దిల్లీలోని అగ్‌మార్కెట్‌లో 2021-22లో జరిగిన విక్రయాల రిటైల్‌ ధరలపై అధ్యయనం చేశారు.
  • వినియోగదారుడు చెల్లించే ధరలో టమాటా రైతుకు 33.5 శాతం మాత్రమే దక్కుతున్నట్లు తేలింది. అంటే కిలోకు రూపాయి వస్తే రైతుకు దక్కేది 33.5 పైసలు మాత్రమే. ఇందులో రవాణా, లేబర్‌ ఛార్జీలు కలిసే ఉన్నాయి. రైతు శ్రమ అదనం.

ట'మాటల్లేవ్‌' - సెంచరీ కొట్టిన ధర - TOMATO PRICES IN TELANGANA

బియ్యం కుతకుత, నూనెలు సలసల - పండుగ వేళ నిత్యావసరాల మంట - Essential Commodities Prices Hikes

Last Updated : Oct 8, 2024, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details