Winter Exercises : పెరిగే వయసుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వయసు, బరువులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయామాలు, ఆసనాలు తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వారు ఎలాంటి సూచనలు, జాగ్రత్తలు చెబుతున్నారో ఒకసారి తెలుసుకొని.. శరీరాన్ని శీతాకాలంలో కాపాడుకుందాం.
భరించలేని ఒళ్లు నొప్పులు :శీతాకాలం వచ్చిందంటే చాలు ఒళ్లు నొప్పులు వేధిస్తుంటాయి. అదే వృద్ధుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మెడనొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి, షుగర్, బీపీలతో బాధపడుతుంటారు. ఫలితంగా నడవలేకపోవటం, శరీరం అలసటతో సుస్తీగా ఉండటం, కళ్లు బైర్లు కమ్మడం, మెడ తిప్పలేకపోవడంతో దేనిపైన కూడా మనసును లగ్నం చేయలేకపోతారు. ఈ బాధలు నుంచి రక్షణ పొందేందుకు శరీరాన్ని ధృడంగా ఉంచుకోవాలని వ్యాయామం చేద్దామనుకుంటే మాత్రం చలి. దీంతో చాలా మంది వ్యాయామాలకే దూరంగా ఉంటున్నారు. కనీసం తేలికపాటి వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారని తెలుపుతున్నారు.
అయితే వ్యాయామాల్లో అన్నింటికంటే ముఖ్యమైంది నడకనే. కాళ్లు, చేతులు ఆడిస్తూ మెల్లగా నడవాలి. ముఖ్యంగా ఉదయం ఏడు గంటల వరకు సూర్యకాంతి శరీరానికి విలువైన యాంటీబయాటిక్గా పని చేస్తుంది. మనిషి నిమిషానికి 18 నుంచి 22 సార్లు శ్వాస తీసుకోవటం, వదలటం చేస్తాడు. దీన్ని 24 నుంచి 26 వరకు పెంచుకోవాలి. దీని ద్వారా మనిషిలో చురుకుదనం పెరిగి, అలసట తగ్గుతుంది.
చలికాలంలో ఏసీ వాడుతున్నారా? ఆస్థమా, ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త! ఈ చిట్కాలు పాటిస్తే సరి!!
మెడ నొప్పికి వ్యాయామం :
- రోజు ఉదయం అరగంట సేపు నడవాలి. కనీసం 2 కి.మీ నడిస్తే చాలు.
- మెడనొప్పి పోవడానికి ఓ చోట వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.
- మెడను కిందకు, పైకి ఎత్తాలి.
- ఇరుపక్కలా మెడను తిప్పుతూ నెమ్మదిగా చూడాలి.
- నోటిని మూసుకొని ముక్కుతో శ్వాస తీసుకోవాలి.
- ఒక్కోటి ఐదు సార్లు చేశాక కాస్త విరామం తీసుకోవాలి.
- రెండు చేతులను దోసిలి మాదిరి పట్టుకొని తల వెనక్కి ఉంచి మెల్లగా ఒత్తాలి.
- అలాగే నొసటి మీద ఉంచి తలను ముందుకు ఒత్తడం చేస్తే మెడకు మంచి వ్యాయామం అవుతుంది.
నడుం నొప్పి పోవాలి అంటే :
- నడుం నొప్పి నివారణకు చేయాల్సిన పద్ధతి పేరు బ్యాంక్ ఎక్స్‌టెన్షన్ ఎక్సర్‌సైజ్ ఇందులో క్వాడ్రిసెప్స్ అనే వ్యాయామం మోకాళ్లకు ఉపయోగపడుతుంది.
- బాణంలా నిల్చోవాలి.
- చేతులు నడుంకు ఆనించి వెనక్కి వంగాలి.
- కాళ్లు నిటారుగా ఉంచాలి.
- కనీసం అయిదుసార్లు ఇలా చేయాలి.
- ఆ తర్వాత కొన్ని సెకన్లు విరామం తీసుకుని మళ్లీ చేయాలి.
- నేలపై పడుకొని కాళ్లను చాచాలి.
- మెల్లిగా కాళ్లను ఒకదాని తర్వాత ఒకటి పైకి లేపుతూ కిందకు దింపాలి.
- ఆ తర్వాత రెండు మోకాళ్ల వద్ద చేతులు పట్టుకొని మెల్లిగా ఛాతివైపు లాక్కోవాలి.
- ఇవన్నీ మెల్లగా చేయాల్సినవే. భారం అనిపిస్తే చేయకపోవడం ఉత్తమం.
వ్యాయామం చేసే ముందు :వ్యాయామం చేసే వాళ్లు ఎవరైనా ఒంటిపై వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. నడకకు వెళ్లేవారు బూట్లు వేసుకోవాలి. సిమెంటు, బీటీ రోడ్లపై కాకుండా మట్టి నేలపై వాకింగ్ చేయాలి. ఆస్తమా వ్యాధిగ్రస్థులు చలికి, దుమ్ముధూళికి దూరంగా ఉంటే మంచిది. వయసు పెరిగిన కొద్దీ శరీరంలో తెలియని మార్పు వస్తుంది. యవ్వనంలో ఉరకలెత్తిస్తుంది. మధ్య వయసులో ఆలోచనలు రేకెత్తిస్తుంది. వృద్ధాప్యంలో ఆందోళనకు గురి చేస్తుంది అందుకు అనుగుణంగా నడుచుకుంటే శ్రేయస్కరం.
చలికాలంలో జర పైలం - నిర్లక్ష్యం చేస్తే ఈ ఆరోగ్య సమస్యలే వస్తాయి
ఈ పథ్యాహారం - మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలట! - ఎలా తీసుకోవాలో తెలుసా?