Excise Police Raids in Dhoolpet :హైదరాబాద్ ధూల్‌పేట్‌లో స్మగ్లర్లు, అమ్మకందార్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 31 నాటికి ధూల్‌పేటలో గంజాయి అమ్మకాల నిర్మూలన దిశగా ముందుకెళ్తున్నట్లు ఎక్సైజ్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఆపరేషన్ ధూల్‌పేట' పేరుతో 25రోజుల నుంచి ఆబ్కారీశాఖ సహా వివిధ పోలీస్ బృందాలు ధూల్‌పేట్‌లో ఇంటింటి సోదాలు నిర్వహిస్తూ జల్లెడ పడుతున్నాయి. స్మగ్లర్లు ఎక్సైజ్ దాడులకు భయపడి ఇళ్లకు తాళాలు వేసి ఆరు బయటి నుంచే గంజాయి వ్యవహారాలు నిర్వహిస్తున్నారు.
2016లో ధూల్‌పేటలో నాటుసారా తయారీ నిర్మూలించేందుకు ఆబ్కారీ అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. నాటుసారా కథ ముగిసిందని భావించారు. ఇప్పుడు అదే ధూల్‌పేటను కొందరు అక్రమార్కులు గంజాయి అడ్డాగా మర్చారు. ఇక్కడి నుంచే హైదరాబాద్ మొత్తానికి గంజాయి అమ్మకాలు జరిపే స్థాయికి ఎదిగారు. 15 మందికి పైగా చెప్పుకోదగ్గవాళ్లు ఈ వ్యాపారంలో కోట్లు గడించారు. మరో 20 మంది స్థానికంగా ఇళ్లు, దుకాణాల నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
దందాలో మహిళలే అధికం :100 నుంచి 150 మంది గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకాలు చేపట్టడం, డోర్ డెలీవర్ చేయడం లాంటివి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాపారంలో మగవారి కంటే మహిళలే ముందుండి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరా చేస్తున్న 15 మందిలో ఆరుగురుని ఎక్సైజ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
నానక్‌రామ్‌గూడ అడ్డాగా నీతూబాయి గాంజా దందా - పోలీస్ డెకాయ్ ఆపరేషన్‌లో బహిర్గతం