Irregularities in State Excise Department :వైఎస్సార్సీపీ పాలనలో ఎక్సైజ్ శాఖలో ఐదేళ్లు చక్రం తిప్పిన అధికారి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరులో అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి ఆ అధికారి బినామీ పేర్లతో విరాళం ఇచ్చారు. దాతలు వరంగల్‌కు చెందిన వ్యక్తులుగా చెబుతున్నా వారి వెనుక ఆ అధికారి ఉన్నారనేది బహిరంగ రహస్యం. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారికి పేరుంది. కొందరి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న అధికారి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు.
దేవదాయశాఖ అధికారులు, పాలకవర్గం ఆలయ పునఃనిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆ అధికారి ఆలయానికి వచ్చారు. అధికారి తమ బంధువుల పేర్లతో విరాళం ఇచ్చేందుకు సిద్ధమై ఆలయ అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. రూ.2కోట్ల విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన అధికారి మరో రూ.50లక్షలు అదనంగా ఇవ్వడానికైనా సిద్ధమేనని అంతా రాళ్లతో నిర్మించాలని సూచించారు. ఆలయ పునఃనిర్మాణానికి దేవాదాయశాఖ రూ.కోటి మంజూరు చేసింది. మొత్తం రూ.3.5 కోట్లతో గుత్తేదారు పనులు చేస్తున్నారు. మంచికలపూడికి చెందిన ఒక వైఎస్సార్సీపీ నాయకుడిని ఎంపికచేసుకున్నారు. అతడే పని జరుగుతున్న విధంగా కూలీలకు నగదు ఇవ్వడం, లావాదేవీలు చేయడం వంటి చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమ్మవారి ఆలయ నిర్మాణ రూపాన్నే మార్చేశారు.
నెలన్నరగా అజ్ఞాతంలో వాసుదేవరెడ్డి - చర్యలు ఎప్పుడు ? - Former APSBCL MD Absconded