తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు : ఎర్రబెల్లి దయాకర్‌ - ERRABELLI ON PHONE TAPPING CASE - ERRABELLI ON PHONE TAPPING CASE

Errabelli Dayakar On Praneeth Rao Phone Tapping Case : పోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దుగ్యాల ప్రణీత్ రావు కూడా తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదే విధంగా తనపై ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 1:34 PM IST

Updated : Mar 26, 2024, 2:36 PM IST

ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు : ఎర్రబెల్లి దయాకర్‌

Errabelli Dayakar On Praneeth Rao Phone Tapping Case :ఫోన్ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దుగ్యాల ప్రణీత్ రావు కూడా తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రణీత్ రావు బంధువులు తమ ఊరిలో ఉన్నారన్న ఆయన వారికి ఏ పార్టీతో సంబంధం ఉందో తనకు తెలియదని, విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అని వ్యాఖ్యానించారు. దయాకర్ రావు తనకు తెలియదనిప్రణీత్ రావుస్టేట్​మెంట్ ఇచ్చారన్న ఎర్రబెల్లి పార్టీ మారాలంటూ కొందరు తనపై ఇలాంటి ఆరోపణలతో ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు.

ప్రజల కోసం పోరాటాలు చేశా ఎక్కడా పొరపాటు చేయలేదు : తెలుగుదేశంలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాడానన్న దయాకర్ రావు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదని అన్నారు. తనను ఇరికించాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. ప్రజల కోసం పోరాటాలు చేశాను తప్ప ఎక్కడా పొరపాటు చేయలేదని తెలిపారు. ఇబ్బంది పెట్టాలని తనపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆక్షేపించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌ - TS PHONE TAPPING CASE UPDATE

Land Kabja Allegations on Errabelli :తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదన్న ఆయన భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని ఆయణ్ను బీజేపీ నుంచి తొలగించినట్లు తెలిసిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని శరణ్ చౌదరిపై ఎన్నో కేసులు ఉన్నాయని అటువంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దని కోరారు. శరణ్ చౌదరిపై ఫిర్యాదుతో విజయ్ అని ఒకరు తన దగ్గరకు వస్తే పోలీస్ కమిషనర్ వద్దకు పంపానన్న ఆయన విజయ్ తనకు బంధువు కాదని స్పష్టం చేశారు.

"నాపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్‌చౌదరి నాకు తెలియదు. భూదందాలు చేస్తున్నారని నుంచి తొలగించినట్లు తెలిసింది.నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు తెలిసింది. శరణ్‌చౌదరిపై ఎన్నో కేసులు ఉన్నాయి. శరణ్‌ చౌదరిపై ఫిర్యాదుతో విజయ్ నా వద్దకు వస్తే సీపీ వద్దకు పంపాను. విజయ్ నాకు బంధువు అనడం తప్పు. ప్రజల కోసం పోరాటాలు చేశా పొరపాటు చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రణీత్‌రావు గురించి నాకు తెలియదు. ప్రణీత్‌రావును విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి." - ఎర్రబెల్లి దయాకర్‌, బీఆర్ఎస్ నేత

ఇటీవలె టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై బీజేపీ నాయకుడు శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఓ వీడియో సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. 2023 ఆగస్టు 21వ తేదీన ఆఫీస్‌కు వెళ్తుండగా, మార్గమధ్యలో సివిల్ డ్రెస్సులో కొంత మంది పోలీసులు తనను కిడ్నాప్ చేశారని శరణ్ చౌదరి ఆరోపించారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశాల మేరకు తనను అక్రమంగా రెండు రోజుల పాటు నిర్బంధించారని పేర్కొన్నారు. రూ. 50 లక్షల విలువచేసే ఓ ప్లాటు ఎర్రబెల్లి, తన బంధువు విజయ్ పేరిట రాయించుకున్నారని ఆరోపణలు చేశారు. మరో 50 లక్షలు తన స్నేహితుడి నుంచి తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపాలని కోరారు.

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేరం అంగీకరించిన నిందితులు! - నేడు కస్టడీకి కోరనున్న పోలీసులు - Telangana Phone Tapping Case

Last Updated : Mar 26, 2024, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details