TS Engineering Admissions Counseling Schedule Release : తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. అలాగే జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈసారి మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. చివరిగా ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ :
- జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
- జూన్ 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం
- జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్
- జులై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు
- జులై 30 నుంచి ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్
- ఆగస్టు 5న తుదివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ
- ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు
- ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల
పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ :రెండు విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్‌ను చేయనున్నారు. జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటా ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
- జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
- జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు
- జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు
- జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
- జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు
- జులై 13 న రెండో విడత సీట్ల కేటాయింపు
- జులై 21 నుంచి పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం
- జులై 24లోపు పాలిసెట్ సీట్ల కేటాయింపు
- జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాల విడుదల