తెలంగాణ

telangana

ETV Bharat / state

జొన్నరొట్టెలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో - అలాంటి వారు రోజూ తినాలంటున్న డాక్టర్లు - WOMEN EARN INCOME WITH JOWER ROTI

ఆరోగ్యంపై శ్రద్ధతో జొన్నరొట్టెలకు పెరుగుతున్న గిరాకీ - దీంతో వేల మంది మహిళలకు ఉపాధి

Jowar Roti
Employment For Women With Jowar Roti (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 11:54 AM IST

Employment For Women With Jowar Roti :ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది ప్రస్తుత కాలంలో రాత్రి అన్నం తినకుండా రొట్టెలు తింటున్నారు. అయితే ఇటీవల జొన్న రొట్టెలు తినేవారి సంఖ్య పెరుగుతోంది. జొన్నల్లో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు తదితర పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ జొన్న రొట్టెలు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

జొన్న రొట్టతో ఆరోగ్య ప్రయోజనాలు :

చురుకుదనం: జొన్నల్లో ప్రోటీన్, కార్బొహైడ్రేడ్లు ఇతర పోషకాలు కలిగి ఉండటం వల్ల శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది. జొన్న రొట్టె రోజూ తినడం ద్వారా చురుకుదనాన్ని కలిగిస్తాయి.

జీర్ణ వ్యవస్థ క్రమబద్ధం : జొన్నరొట్టెలో అధికంగా ఉండే డైట్‌ ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను క్రమబద్ధంగా, సులభంగా ఉంచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యలను తగ్గించి, పేగు సంరక్షణను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గుదల : జొన్న రొట్టెలో పీచు (ఫైబర్‌) ఎక్కువగా ఉండటంతో త్వరగా ఆకలి వేయదు. అధిక కొలెస్ట్రాల్‌ తగ్గించి, అనవసరమైన కేలరీలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనే వారు రోజూ రాత్రి వేళలో రొట్టెలు తింటే ప్రయోజనం కనిపిస్తుంది.

మధుమేహం నియంత్రణ : జొన్నరొట్టెలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది. గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించి మధుమేహం దరికి రాకుండా చేస్తుంది.

గుండె వ్యాధులు దూరం : జొన్నల్లో ఉండే ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.

హిమోగ్లోబిన్‌ పెంచుతుంది : ఈ రొట్టెలో మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, విటమిన్‌ బి లాంటివి శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తహీనత తగ్గించడంలో తోర్పడుతాయి. హిమోగ్లోబిన్‌ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఎముకల గట్టిదనం : మెగ్నీషియం, కాల్షియం లాంటి ఖనిజాలు ఎముకలు బలంగా ఉండేలా చూస్తాయి. ఎముకల సంబంధిత వ్యాధులు, సమస్యలను తగ్గించడానికి జొన్నలు మంచి ఆహారం. వృద్ధులు రోజూ తినడం వల్ల ఎముల గట్టిదనం పెరుగుతుంది.

క్యాన్సర్‌ కణాల నియంత్రణ : జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం ద్వారా క్యాన్సర్‌ కణాల వృద్ధిని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పోలీఫినాల్స్‌ అనే పదార్థం శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నియత్రిస్తుంది. విటమిన్‌ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో వ్యాధి కారకాలను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.

"జొన్నల్లో అనేక పోషకాలు ఉంటాయి. మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు క్రమం తప్పకుండా తీసుకుంటే మేలు. ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ బి లాంటివి పుష్కలంగా అందుతూ ప్రయోజనం చేకూరుస్తాయి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా జొన్నరొట్టెలు తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది." - డాక్టర్‌ దాసరోజు రమేష్, న్యూరో ఫిజీషియన్, హనుమకొండ

జొన్న రొట్టెల వ్యాపారం: మరోవైపు జొన్న రొట్టెలు తినేవారు రోజురోజుకూ పెరుగుతుండటంతో మహిళలకు రొట్టెల తయారీ జీవనోపాధిగా మారిపోయింది. వరంగల్‌ నగరంలోనే రోజుకు వేల రూపాయల వ్యాపారం సాగుతోంది. దీనికి పెట్టుబడి లేకపోవడంతో పేద మహిళలు సైతం రొట్టెల తయారీ వ్యాపారం చేసుకుంటున్నారు. రొట్టెల తయారీ, వ్యాపార కేంద్రాలు వెయ్యికి పైగా ఉన్నాయి. ఒక్కో రొట్టె రూ.15 చొప్పున అమ్ముతున్నారు.

నగరంలోని గిరిజన మహిళలు రొట్టెల తయారీతో ఉపాధి పొందుతున్నారు. మారుమూల గిరిజన తండాలు, గ్రామాల నుంచి వచ్చి నగరంలో జొన్నరొట్టెల వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనికి సాయంత్రం ఎక్కువగా గిరాకీ ఉంటుంది. ఒక్కొక్కరు 100 నుంచి 200 రొట్టెల వరకు అమ్ముతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మకాలు జోరుగా ఉంటున్నాయి. ఖర్చులు పోనూ రోజూ రూ.1000 నుంచి రూ.2000 వరకు సంపాదిస్తున్నారు.

జొన్న రొట్టెలు రోజూ తినడం వల్ల జరిగేది ఇదేనట! - నిపుణుల సూచనలు మీకోసం - Jowar Roti Benefits

జొన్న రొట్టెలు చేయడానికి ఎక్కువ టైమ్ పడుతోందా? - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ​! పైగా సూపర్​ సాఫ్ట్​! - Jowar Roti Recipe

ABOUT THE AUTHOR

...view details