Ramoji Rao Statue Making in Konaseema District at AP : మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు విగ్రహం ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజకుమార్ వుడయర్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిమ తుది మెరుగులు దిద్దుతున్నారు. విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు.
రామోజీరావు జీవితమొక తెరిచిన పుస్తకం - ప్రతి పేజీ ఒక మధురానుభూతి - Ramoji Rao Biography in Telugu
Ramoji Rao Statue in Andhra Pradesh : ఈ నెల 8న (జూన్ 8) పరమపదించిన అక్షర సూర్యుడు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజ్‌కుమార్ వుడయార్ కోనసీమ జిల్లా కొత్తపేటలో విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు.
"రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని తయారు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సిల్వర్ నమోనాలో తయారు చేస్తున్నాం. నవంబర్ 16న ఆయన పుట్టినరోజు సందర్భంగా రామోజీరావు విగ్రహాలను పెట్టాలని అనుకుంటున్నాం. సుమారు 25 వరకు రూపొందిస్తున్నాం. నగరాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టాలనే సంకల్పం ఉంది." - రాజ్‌కుమార్ వుడయార్, ప్రముఖ శిల్పి