Eenadu Golden Jubilee celebrations : తెలుగు నేలపై ఈనాడు చేరని ఊరు, తెలియని గడప ఉండదు. జనం హృదయాల్లో సుస్థిరంగా నిలిచిన ఈనాడు దిన పత్రిక అర్ధ శతాబ్ద ప్రస్థానం ఓ ప్రభజనం. 46 ఏళ్లుగా అత్యధిక సర్క్యులేషన్‌తో నంబర్ 1 స్థానంలో నిలవడం ప్రతికా రంగంలో రికార్డు. అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తూ, అన్ని వర్గాలకు చేరువైన ఈనాడు స్వర్ణోత్సవ సంబురాలు వైభవోపేతంగా సాగాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఈనాడు గ్రూపు సంస్థల సారథులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈనాడు సర్ణోత్సవ వేడుకలకు ప్రయోక్తలుగా ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, పద్మశ్రీ వ్యవహరించారు. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఈనాడు డైరెక్టర్ ఐ.వెంకట్, ఈటీవీ సీఈవో బాపినీడు, ఈనాడు గ్రూప్ ప్రెసిడెంట్ హెచ్‌ఆర్ గోపాలరావు, కంపెనీ సెక్రటరీ జి.శ్రీనివాస్, ఆర్థిక సలహాదారు జి.సాంబశివరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఈనాడు అసోసియేట్ ఎడిటర్ కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేశారు.
మూడు తరాలతో అనుబంధం : ఈనాడుకు మూడు తరాల పాఠకులతో అనుబంధం ఉందని, వచ్చే మూడు తరాలు కూడా ఈనాడు వెంటే ఉండేలా ప్రణాళికలు వేసుకోవాలని ఎండీ కిరణ్ దిశానిర్దేశం చేశారు. ఈనాడు సైన్యం ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజలు పాఠకులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రామోజీరావై పని చేయాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కోరారు. ఈనాడు జైత్రయాత్ర ఇలాగే కొనసాగాలని ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి అన్నారు.
"ఛైర్మన్ రామోజీరావు ఎప్పుడూ ఒక్క విషయం చెప్పేవారు. మీరు తప్పు చేయనంత వరకు నా అంత బలవంతుడు లేడు. మీరు తప్పు చేసినట్లయితే నా అంత బలహీనుడు లేడని అనేవారు. ప్రజా సమస్యలపై ఈనాడు ఎంతో పోరాటం చేసింది. ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రామోజీరావై పని చేయాలి". - శైలజా కిరణ్, ఎండీ మార్గదర్శి
ఐదు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం - ఇది ఈనాడు చరిత్ర - Eenadu Golden Jubilee Celebrations