ETV Bharat / state

అసామాన్య కృషికి సత్కారం - ఏపీ నుంచి నలుగురికి 'పద్మ' పురస్కారం - PADMA AWARDS IN AP 2025

ఏపీ నుంచి నలుగురికి పద్మశ్రీ అవార్డులు - వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకత

Padma Awards in AP 2025
Padma Awards in AP 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 7:08 AM IST

Updated : Jan 26, 2025, 12:05 PM IST

Padma Awards in AP 2025 : కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏపీకి సముచిత ప్రాధాన్యం దక్కింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకు గానూ నలుగుర్ని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఆ పద్మా కుసుమాల నేపథ్యమేంటి వారి విజయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం రండి. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు అరుదైన గౌరవం దక్కింది. బుర్రకథను తెలుగునేలపై ఐదు దశాబ్దాలుగా ఆయన వెలిగించారు.

గాత్రంతో ఆకట్టుకుంటూ మనదేశంలోనే కాకుండా సింగపూర్, కువైట్‌లలోనూ అప్పారావు ప్రదర్శనలు ఇచ్చారు. గానకోకిల, బుర్రకథ టైగర్, వైఎస్​ఆర్ ఎచీవ్‌మెంట్‌ వంటి బిరుదులు, పురస్కారాలతోపాటు ఎన్నో సత్కారాలు అందుకున్నారు. అప్పారావు అస్వస్థతకు గురై ఈ నెల 15న కన్నుమూశారు. 5,000లకు పైగా ప్రదర్శనలిచ్చి తెలుగు జానపద కళకు ఊపిరులూదిన ఆయనకు కేంద్ర సర్కార్ పద్మశ్రీ ప్రకటించింది. పెద్దకార్యం రోజున శనివారమే పురస్కార ప్రకటన వెలువడం పట్ల కుటుంబసభ్యులు, ఆయన శిష్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Padma Awards 2025 : కళారంగంలో పద్మశ్రీ పొందిన మరో తెలుగు వ్యక్తి మాడుగుల నాగఫణిశర్మ. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన నాగఫణిశర్మ 50 ఏళ్లుగా అవధానాలు చేస్తున్నారు. ఆయన 19 సంవత్సరాల వయసులోనే మొదటిసారి రాజమహేంద్రవరంలో శతావధానం చేసి అబ్బురపరిచారు. 2000లకు పైగా అవధానాలు, 27 శతావధానాలు, ఒక సహస్రావధానం, ఒక ద్విసహస్రావధానం చేశారు. తెలుగు, సంస్కృతం కలిపి సహస్రావధానం చేసిన ఏకైక కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయీ సమక్షంలో అవధానాలు నిర్వహించి మన్ననలు పొందారు. అవధాన సహస్రఫణి, బృహత్‌ ద్విసహస్రావధాని, శతావధాని సామ్రాట్‌ వంటి బిరుదులు పొందారు. అవధానంలో అపూర్వ విజయ శిఖరాలకు చేరిన నాగఫణిశర్మను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.

KL Krishna Gets Padma Shri : ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ కేఎల్ కృష్ణ 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన ఆయన దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, డైరెక్టర్, పరిశోధకులు, ఆర్థికరంగ నిపుణులుగా పలు హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఛైర్మన్, అధ్యక్ష హోదాల్లోనూ సేవలందించారు. ఇండస్ట్రీయల్‌ ఎకనామిక్స్, ప్రాంతీయ, ఆర్థిక అసమానతలపై అనేక అధ్యయనాలు, పరిశోధనలు చేసి 30కిపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు.

ఫుల్‌బ్రైట్‌ ట్రావెల్‌ గ్రాంట్, షికాగోకు చెందిన గోల్‌డెట్జ్‌ ఫౌండేషన్‌ ఫెలోషిప్‌తో పాటు ఫోర్డ్‌ ఫౌండేషన్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్, బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ను కేఎల్ కృష్ణ అందుకున్నారు. ఆర్థిక రంగ మేధావిగా అధ్యయనాల్లో మేటిగా నిలిచిన ఆయనకు విద్యా సాహిత్య విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

Panchamukhi Get Padma Shri 2025 : సాహిత్యం, విద్య విభాగాల్లో రాఘవేంద్రాచార్య పంచముఖి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కర్ణాటకలోని బాగల్‌కోటె వాసి వాదిరాజ్‌ రాఘవేంద్రాచార్య పంచముఖి ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త విద్యారత్న ఆర్ఎస్.పంచముఖి పెద్ద కుమారుడు. భారతీయ సామాజికశాస్త్ర పరిశోధన మండలి ఛైర్మన్‌గా, ఇండియన్‌ ఎకనామిక్‌ జర్నల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌గా రాఘవేంద్రాచార్య పనిచేశారు. ఐక్యరాజ్యసమితి, యూఎన్​సీటీఏడీ, యూఎన్​డీపీ, ఐఎల్ఓ కన్సల్టెంట్‌గా సేవలందించారు.

రాఘవేంద్రాచార్య పంచముఖి భారతీయ పురాతత్వశాస్త్రం, ఆధునిక విభాగాల అనుసంధానంపై పలు రచనలు, కావ్యకుసుమాకర సంస్కృత కవితల సంకలనం చేశారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విద్యాపీఠం ఛాన్సలర్‌గానూ పనిచేసిన ఆయన సంస్కృత, విజ్ఞాన ప్రదర్శనల ప్రతులకు డిజిటలైజేషన్‌లపై సేవలందించారు. ఆయన పదవీ కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో ద్వైత వేదాంతమనే కొత్త విభాగాన్ని స్థాపించారు. అర్థశాస్త్రవేత్త సాహిత్యాభిలాష కలిగిన 85 ఏళ్ల రాఘవాచార్యను పద్మ శ్రీతో కేంద్రం సత్కరించింది.

బాలకృష్ణకు పద్మభూషణ్​ - సీఎం చంద్రబాబు అభినందనలు

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ - మరో నలుగురికి పద్మశ్రీ

Last Updated : Jan 26, 2025, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.