తెలంగాణ

telangana

ETV Bharat / state

టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - నియామక ఫైల్​పై గవర్నర్ సంతకం

టీజీపీఎస్‌సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - నియామక ఫైల్‌పై సంతకం చేసిన గవర్నర్‌ - డిసెంబర్‌ 3తో ముగియనున్న మహేందర్‌ రెడ్డి పదవీ కాలం - ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వెంకటేశం

NEW TGPSC CHAIRMAN
BURRA VENKATESHAM TGPSC CHAIRMAN (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 11:27 AM IST

Updated : Nov 30, 2024, 12:23 PM IST

Burra Venkatesham Appointed as TGPSC Chairman :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్​గా బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. బుర్రా వెంకటేశం నియామక ఫైల్​పై గవర్నర్ జిష్టుదేవ్​ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుత టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో బుర్రా వెంకటేశం ఐఏఎస్​కు స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. 1995 ఐఏఎస్ బ్యాచ్​కు చెందిన బుర్రా వెంకటేశం సర్వీస్​ 2028 ఏప్రిల్ 10 వరకు ఉంది.

బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్​గా గరిష్ఠంగా 2030 ఏప్రిల్ 10 వరకు కొనసాగే అవకాశం ఉంది. జనగామ జిల్లాకు చెందిన బుర్రా వెంకటేశం ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ ఛైర్మన్​గా జనవరిలో మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు టీజీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు అప్పటి గవర్నర్​ తమిళిసై ఆమోద ముద్ర వేయగా, అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా మహేందర్‌ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో బుర్రా వెంకటేశంను నూతన ఛైర్మన్​గా నియమించారు.

Last Updated : Nov 30, 2024, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details