తెలంగాణ

telangana

ETV Bharat / state

చూడ్డానికి రెండు కళ్లు చాలని కొత్వాల్​గూడ ఎకో పార్క్​ - వారెవ్వా! ఏంటి బ్రో ఆ సదుపాయాలు

హైదరాబాద్​లో ముస్తాబవుతున్న ఎకో పార్క్ - 85 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఉన్న అంతర్జాతీయ స్థాయి పార్క్ - అతి పెద్ద పక్షిశాలతో వావ్​ అనిపిస్తున్న పార్క్ నిర్మాణం

Kothwalguda Eco Park in Hyderabad
Kothwalguda Eco Park in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2024, 8:45 AM IST

Kothwalguda Eco Park in Hyderabad : వారం మొత్తం పని చేసి సెలవు రోజు గురించి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తాము. ఆ ఒక్కరోజే బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ నగరానికి దూరంగా వెళ్లి పర్యాటక ప్రాంతాలను చూసి రావాలని ప్లాన్​ చేసుకుంటారు. కానీ ఉన్నది ఒక్కరోజు మాత్రమే.. ఈ ఒక్కరోజు గురించి అంతదూరం ప్రయాణం చేయాలా అని ఆలోచించి చాలా మంది వెళ్లకుండా ఇంట్లోనే బోర్​ కొట్టిన కాలక్షేపం చేస్తారు. ఇలాంటి వారి కోసం, కార్తిక మాసం కావడంతో విహారయాత్రలు వెళ్లేవారికోసం, నగరంలో నిత్యం ట్రాఫిక్​ ధ్వనుల మధ్య ఉండేవారికోసం ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరేందుకు నగరం నడిబొడ్డున హిమాయత్​ సాగర్ దరిలో ప్రకృతి ఉద్యానం ముస్తాబవుతోంది. ఇది 85 ఎకరాల విస్తీర్ణంలో ఉంటూ ఇక్కడ ఉండే సౌకర్యాలను చూస్తే వావ్​ అనాల్సిందే.

ఐటీ కారిడార్​, శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఓఆర్​ఆర్​ను అనుకొని కొత్వాల్​గూడ ఎకో పార్క్​కు రెండేళ్ల క్రితమే హెచ్​ఎండీఏ శ్రీకారం చుట్టగా, ఇప్పుడు ఆ పనులు కొలిక్కి వస్తున్నాయి. ఈ ఎకో పార్క్ సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడి నిర్మాణాలను రూ.300 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అతిపెద్ద అక్వేరియం, బోర్డు వాక్​, ల్యాండ్​ స్కేపింగ్, పక్షిశాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఎకో పార్కు వారాంతాల్లో ప్రకృతి చెంత గడపాలని అనుకునే వారి ఎంతో ఉపశమనం ఇస్తుంది. ఎందుకంటే జూ మినహా మరొకటి నగరంలో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ కొత్వాల్​గూడ పార్క్​ రావడంతో పాటు హిమాయత్​సాగర్ జలాశయం ఉండటంతో వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఎకో పార్క్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం టూరిజం పరంగా మరింత అభివృద్ధి చెందనుండగా.. పెద్ద టూరిజం స్పాట్​గా మారనుంది.

పార్కులో అతిపెద్ద పక్షి శాల :

  • ఎకో పార్కులో అతిపెద్ద పక్షిశాల ఏర్పాటు
  • ఈ అతిపెద్ద పక్షిశాల ఆరు ఎకరాల్లో ఉంది.
  • పక్షిశాల సీతాకోక చిలుక ఆకృతిలో నిర్మాణం
  • ఇక్కడికి పెరూ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అమెరికా, న్యూజిలాండ్స్, జపాన్​, చైనా దేశాలకు చెందిన అరుదైన 200-300 రకాల పక్షులను ఇక్కడ ఉంచనున్నారు.
  • సముద్ర జీవుల కోసం అతిపెద్ద అక్వేరియం అందుబాటులోకి
  • పిక్నిక్ పార్క్
  • రిసార్ట్
  • అడ్వెంచర్ జోన్
  • ఫుడ్​కోర్టులు
  • ఓపెన్​ ఎయిర్​ థియేటర్​
  • పర్యాటకులు రాత్రి బస చేసేందుకు పార్కుని ఉన్న అటవీ ప్రాంతంలో కాటేజీలు
  • ఉద్యానం చుట్టూ గోడలపై పక్షులు, జంతువుల బొమ్మలు

నెహ్రూ జూపార్కులో ఘనంగా ఏనుగుల దినోత్సవం - గజరాజులకు పసైందన విందు భోజనం - National Elephant Day Celebrations

కజిరంగలో 30ఏనుగుల జలకాలాట- వరదల తగ్గుముఖంతో సందడి- వీడియో చూశారా! - Kaziranga Elephants Video

ABOUT THE AUTHOR

...view details