EC Permitted Bhadradri Kalyanam Live :భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది.
సీఎం రేవంత్రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చునని ఈనెల 4న పేర్కొంది. అయితే లైవ్ టెలికాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం, కల్యాణ మహోత్సవం విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకొని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని ఈనెల 17న ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు.
భద్రాద్రి సీతమ్మకు కానుకగా త్రీడీ చీర - చూస్తే వావ్ అనాల్సిందే! - Making Video of 3D Saree
Bhadradri Sitaramula Kalyanam : సుమారు నలభై ఏళ్లుగా కుల, మత, జాతులకు అతీతంగా దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.