ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిడ్డల భవిష్యత్తు కోసం విదేశాలకు - స్వగ్రామానికి వస్తుండగా బస్సులో మహిళ మృతి - Woman died bus while return Muscat - WOMAN DIED BUS WHILE RETURN MUSCAT

Woman Dead Due to Heart Attack in Bus: కన్నబిడ్డల భవిష్యత్తు కోసం, వారిని బాగా చదివించుకోవాలని, భర్తకు సహాయంగా ఉండాలని మస్కట్​ వెళ్లిన తూర్పు గోదావరి జిల్లా మహిళ తిరిగి వస్తూ మార్గమధ్యలో బస్సులోనే గుండెపోటుతో మరణించింది. యజమానుల ఇబ్బందులు తట్టులేక ఆరోగ్యం క్షీణించడంతో మరో వారం రోజుల్లో ఇంటికి తిరిగొస్తుందనుకుంటే విగతజీవిగా తిరిగొచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Woman Dead Due to Heart Attack in Bus
Woman Dead Due to Heart Attack in Bus (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 10:19 AM IST

Woman Dead Due to Heart Attack in Bus : భర్తకు సహాయంగా ఉండాలని, పిల్లలను బాగా చదివించుకోవాలనే తపనతో అప్పులు చేసి జీవనోపాధి కోసం ఓ మహిళ మస్కట్‌ వెళ్లారు. అక్కడ ఇబ్బందులు భరించలేక తన స్వగ్రామానికి తిరిగి వస్తూ గుండెపోటుతో మార్గమధ్యలో బస్సులోనే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్యపద్మకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్‌తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

'సెలవు పెట్టినా నా బిడ్డ బతికేది' - కన్నీటిపర్యంతమైన హారిక తల్లి - 17 Members Dead Massive Explosion

కూలి పనులు చేస్తూ దాచిన డబ్బులకు మరికొంత నగదు అప్పు చేసి ఆ మొత్తం సొమ్ము రూ.2 లక్షలు విజయవాడకు చెందిన మహిళా ఏజెంట్‌కు చెల్లించి రెండు సంవత్సరాల క్రితం మహిళ మస్కట్‌కు వెళ్లారు. మస్కట్​లో యజమానుల ఇబ్బందులు తట్టులేక దానికితోడు ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆమె తిరిగి వెళ్లిపోతానని ఆరు నెలలుగా మొర పెట్టుకుంటున్నారు. సత్యపద్మను వెనక్కి పంపించాలని భర్త ఎన్నో సార్లు మహిళా ఏజెంట్‌ను వేడుకున్నా ఆమె కరగలేదు. మరో రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆమెకు డబ్బులను ఇచ్చారు. మరో వారం రోజుల్లో ఇంటికి తిరిగొస్తుందనుకుంటే ఆమె విగతజీవిగా తిరిగొచ్చారు.

సహజీవనంతో బిడ్డ-ఆపై కటిక పేదరికం- పసిగుడ్డును ఏం చేసిందంటే? - Mother Sold Baby For Money

గుండెపోటుతో చనిపోయిందని బస్సు డిపో నుంచి ఫోన్‌ :ఏజెంట్‌కు డబ్బులు చెల్లించిన తర్వాత ఎటువంటి సమాచారం ఇవ్వలేదని సత్యపద్మ భర్త ప్రభాకర్‌ అన్నారు. ఈ నెల 30న పంపిస్తామని, 24నే పంపించేశారన్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా మాకు సమాచారం అందించలేదని ప్రభాకర్​ చెప్పారు. మస్కట్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి, తణుకు బస్సు ఎక్కినట్లు అతడు వివరించారు. మస్కట్‌ నుంచి వస్తున్న మహిళ గుండెపోటుతో చనిపోయినట్లు విజయవాడ బస్సు డిపో నుంచి 24న సాయంత్రం మాకు ఫోన్‌ చేసి చెప్పారని భర్త కన్నీరు పెట్టారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినా దగ్గరుండి చూసుకుంటానని నమ్మబలికి ఏజెంట్‌ మూడు నెలలు ఆమె దగ్గర పెట్టుకుని ఇబ్బందులకు గురిచేసిందని సత్యపద్మ భర్త కంటతడి పెట్టారు.

అమెరికాలో కారు షెడ్​లో పేలిన తుపాకీ- తెలుగు డాక్టర్​ అనుమానాస్పద మృతి - DOCTOR SUSPICIOUS DEATH

ABOUT THE AUTHOR

...view details